హైదరాబాద్ లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్న ద్రౌపది ముర్ము.. ఏమన్నారంటే!!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగర పర్యటనలో భాగంగా దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్ లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్ కు రివ్యూయింగ్ ఆఫీసర్ గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుండి గౌరవ వందనం స్వీకరించిన ఆమె అనంతరం గ్రాడ్యుయేట్స్ ను ఉద్దేశించి మాట్లాడారు.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్ లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత వైమానికదళం నెట్వర్క్ అత్యాధునిక సాంకేతికతతో యుద్ధంలో పోరాడి సవాళ్ళతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటోందని రాష్ట్రపతి తెలిపారు. గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో ధైర్యవంతులు అయిన క్యాడెట్ లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు దేశంకోసం ప్రాణాలను అర్పించిన వారి సేవలను గుర్తుంచుకోవాలని ద్రౌపది ముర్ము తెలిపారు.

టర్కీ లో జరిగిన భూకంపం లో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పని చేసిందని ఆమె కొనియాడారు. కరోనా మహమ్మారి సమయంలోనూ అద్భుతంగా పని చేశారని కితాబిచ్చారు.ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమించడానికి నూతన సాంకేతికతతో సిద్ధంగా ఉండాలన్నారు. ఏప్రిల్ నెలలో తాను సుఖాయ్ జెట్ లో ప్రయాణం చేసినట్టు ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
1948, 1965, 1971 సంవత్సరాలలో శత్రు దేశమైన పొరుగు దేశంతో జరిగిన యుద్ధాలలో దేశాన్ని రక్షించడంలో భారత వైమానిక దళం వీర యోధులు పోషించిన పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది అని ద్రౌపది ముర్ము వెల్లడించారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్లో ఫ్లయింగ్ బ్రాంచ్లో మొత్తం 119 మంది ట్రైనీలు, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ లో 75 మంది ట్రైనీలు కమీషన్ అందుకున్నారు.
అదనంగా ఎనిమిది మంది ఇండియన్ నేవీ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఇద్దరు వియత్నమీస్ ట్రైనీ ఆఫీసర్లు తమ ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మొత్తం భారత వైమానిక దళం లో 211 మంది పైలెట్ కోర్సు, 211 మంది గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్ కోర్స్ శిక్షణ ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఈ కవాతు నిర్వహించారు.












Click it and Unblock the Notifications