తెలంగాణకు కేంద్రం కరవు సాయం రూ. 800 కోట్లు
హైదరాబాద్: కరవుతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయాన్ని ప్రకటించింది. కరవు సాయంగా రూ. 800 కోట్లు అందజేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి కరవు సాయంపై ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం ఆధారంగా ఈ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇంత భారీ ఎత్తున కరవు సాయాన్ని ఎప్పుడూ ప్రకటించలేదని మంత్రి వ్యాఖ్యానించారు.

గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
ఖమ్మం జిల్లా పినపాక మండలం కరకగూడెంలో బ్యాంక్ చోరీ యత్నం జరిగింది. మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో దుండుగులు చోరీకి విఫల యత్నం చేశారు. బుధవారం అర్థరాత్రి బ్యాంక్‌లోకి ప్రవేశించిన దొంగలు లాకర్‌ను పగులకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
అయితే లాకర్ ఎంతసేపటికీ తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications