డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్ట్: 15 రోజులు గోవాలోనే హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్: డ్రగ్స్ సరఫరా కేసులో కీలక సూత్రధారిని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎడ్విన్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ శనివారం వెల్లడించారు.

గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్(మాదక ద్రవ్యాలు) సరఫరాలో ఎడ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నారాయణ బోర్కర్ అనే వ్యక్తిని మూడు నెలల క్రితమే నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో సరఫరా చేయడంలో నారాయణ బోర్కర్‌ది కీలక పాత్ర అని పోలీసులు తెలిపారు.

Drugs case: key accused arrested Edwin arrested in goa by hyderabad police

నారాయణ బోర్కర్ ఇచ్చిన సమాచారంతో నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో పలువురిపై నిఘా పెట్టారు. గత మూడు నెలలుగా ఎడ్విన్ గోవాలో తప్పించుకు తిరుగుతున్నాడు. 15 రోజులుగా గోవాలోనే ఉన్న హైదరాబాద్ పోలీసులు పక్కా ప్రణాళికతో ఎడ్విన్‌ను అరెస్ట్ చేశారు.

కాగా, బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ హత్య కేసుతోనూ ఎడ్విన్, ఇతడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీవెన్ లకు సంబంధాలున్నట్లు తేలింది. ఎడ్విన్ గోవా కర్లీస్ రెస్టారెంట్, పబ్ యజమానిగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+