కొత్త సంవత్సరం వేడుకల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం..!
ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రజలు 2025కు బై బై చెప్పేసి.. 2026కి ఘన స్వాగతం పలికారు. కాగా ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంబరాన్ని అంటేలా జరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్న పబ్బులు, బార్లు, క్లబ్బులు కళకళలాడాయి. కానీ ఈ నేపథ్యంలోనే ఈ వేడుకల్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ లోని ఇల్యూషన్ పబ్ లో డీజే ఆర్టిస్ట్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతన్ని పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. నార్సింగి లో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 5 గ్రాముల కొకైన్ సీజ్ కూడా చేశారు. అంతే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, అబిడ్స్, గన్‌ఫౌండ్రీ, బషీర్‌బాగ్, ఐమాక్స్, దోమలగూడ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు చేశారు.

మరోవైపు ఏపీలోని విశాఖపట్నంలో సైతం "మత్తు: ముఠాలు రెచ్చిపోయాయి. పోలీసులు నిఘాను దాటుకొని డ్రగ్స్ సరఫరాకు కుట్ర పన్నగా.. చివరికి పోలీసుల చేతికి చిక్కారు. లాసన్స్ బే కాలనీలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో డ్రగ్స్ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో లాసన్స్ బే కాలనీ పరిధిలో ఒక డియో బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు యువకులను అడ్డగించారు. వారిని సోదా చేయగా.. భారీగా గంజాయి మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాలు బయటపడ్డాయి. వెంటనే పోలీసులు ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. నిందితులను వినయ్, సాయి, శ్యామ్‌లుగా గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడైన వినయ్.. ఈ మత్తు పదార్థాలను బెంగళూరు నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ పార్టీల కోసం, యువతను టార్గెట్ చేసుకుని వీటిని విశాఖకు తరలించినట్లు అనుమానిస్తున్నారు. కేవలం గంజాయే కాకుండా, సింథటిక్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇక కొత్త సంవత్సరం వేడుకల పేరుతో మత్తు జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయని, పార్టీల ముసుగులో డ్రగ్స్ వినియోగిస్తే జైలు పాలవ్వక తప్పదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications