డ్రగ్స్ మేడిన్ కోళ్లఫారం: రూ. 3.14 కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలమ్ సీజ్
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లాలో భారీగా మాదక ద్రవ్యాల(drugs)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. బిజినేపల్లి మండలం పట్టెం గ్రామ శివారులోని మారుమూల ప్రాంతంలో ఉన్న కోళ్లఫారంలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది.
ఈ క్రమంలో బుధవారం అధికారులు దాడులు నిర్వహించి రూ. 3.14 కోట్ల విలువైన 31.42 కిలోల ఆల్ట్రాజోలమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారుచేస్తున్న మెషనరీని సీజ్ చేశారు. ఆల్ట్రాజోలమ్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.

ఎమర్జెన్సీ లైట్‌లో రూ. 2 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఇటీవల కాలంలో శంషాబాద్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ చేస్తున్న బంగారం బయటపడుతుండటం గమనార్హం. అక్రమార్కులు బంగారం తరలించేందుకు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. అయితే, కస్టమ్ అధికారులు మాత్రం వాళ్ల ఎత్తులను చిత్తు చేస్తున్నారు.
మంగళవారం రియాద్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి 24 గంటలు కాకముందే.. మరొక వ్యక్తి దుబాయ్ నుంచి వస్తూ 2.19 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద కస్టమ్స్ అధికారులు 2.19 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.1.81 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సాఆర్ కడప జిల్లా వాసిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని.. శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఎమర్జెన్సీ లైట్‌లో ఉంచి బంగారాన్ని తరలిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications