హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రంకెన్ డ్రైవ్: పోలీసులకు చుక్కలు చూపిన ఇద్దరు యువతులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రంకెన్ డ్రైవ్‌లో కేసులు పెడుతున్న మద్యం తాగుతూ వాహనాలు నడుపుతున్న కేసులు పెరుగుతున్నాయి. అంతే కాదు మద్యం తాగకుండా వాహనాలు నడపాలని పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న వారాంతపు రోజుల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెట్టకుండా ఉండేందుకు మందు బాబులు పోలీసులపై తిరగబడుతున్నారు. అమ్మాయిలు కూడ ఈ తరహ ఘటనలకు పాల్పడుతున్నారు.

మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండాలని పోలీసులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆశించిన ప్రయోజనం కన్పించడం లేదు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడుతూనే ఉన్నారు.

వారాంతపు సెలవు దినాల్లో ఈ కేసులు ఎక్కువగా హైద్రాబాద్ నగరంలో చోటు చేసుకొంటున్నాయి. పురుషులతో పాటు మహిళలు కూడ ఈ తరహ కేసుల్లో చిక్కుకొంటున్నారు.కొందరైతే ఏకంగా తమ వాహనాల్లోనే మద్యం సీసాలతో దర్శనిమిస్తున్నారు.

మద్యం తాగి పట్టుబడిన మహిళలు

మద్యం తాగి పట్టుబడిన మహిళలు

మద్యం తాగి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద శనివారం రాత్రి ఇద్దరు మహిళలు మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డారు. అంతేకాదు ఆ సమయంలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు వారు సహకరించలేదు. మహిళా కానిస్టేబుళ్ళు ఒత్తిడి చేయడంతో అప్పుడు వారు సహకరించారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద అమ్మాయిల హంగామా

జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద అమ్మాయిల హంగామా

మద్యం తాగి వాహనం నడుపుతున్న ఇద్దరు మహిళలు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు సహకరించలేదు. పైగా ఈ విషయమై టెస్ట్ కోసం ప్రయత్నించిన పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. నానా హంగామా సృష్టించారు. చివరకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు సహకరించారు.అయితే ఈ ఇద్దరు మహిళలు కూడ మోతాదుకు మించి మద్యం సేవించినట్టు నిర్ధారించారు.

75 మందిపై కేసులు నమోదు

75 మందిపై కేసులు నమోదు

మద్యం తాగి వాహనాలు నడుపిన సుమారు 75 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.38 కార్లు, 37 బైకులను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. సోమవారం నాడు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆపై కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.

Recommended Video

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : యాంకర్ ప్రదీప్‌కు శిక్ష తప్పదా ?
కారు రేసింగ్ కు పాల్పడుతున్న 9 మంది అరెస్ట్

కారు రేసింగ్ కు పాల్పడుతున్న 9 మంది అరెస్ట్


శనివారం రాత్రి పూట కారు రేసింగ్ కు పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద వీరంతా కారు రేసింగ్ పాల్పడుతున్నట్టు పోలీసులు చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.

English summary
Hyderabad Traffic police seized 13 vehicles including seven cars during drunk and drive checks conducted at Jubilee Hills check post in the late night hours of Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X