ఫోన్ ట్యాపింగ్ కేసు: డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ ఆర్డర్‌లో సంచలన విషయాలు
హైదరాబాద్: కాల్ ట్యాపింగ్ (ఫోన్ ట్యాపింగ్) వ్యవహారంలో సస్పెండ్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ కుమార్ రావు సస్పెన్షన్ ఆర్డర్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డీఎస్పీగా పని చేస్తున్న ప్రణీత్ రావు.. గతంలో హైదరాబాద్ ఎస్ఐబీలో పని చేస్తున్న సమయంలో తన హోదాను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు పోలీసు శాఖ గుర్తించింది.
తన ఎస్ఓటీ బృందం కోసం హైదరాబాద్ ఎస్ఐబీ కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రణీత్ ఏర్పాటు చేసుకున్నట్లు సస్పెన్షన్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఈ తతంగమంతా అతనే నడిపినట్లు అధికారులు తేల్చారు. కంప్యూటర్లోని 42 హార్ట్ డిస్క్‌లు కూడా మార్చినట్లు గుర్తించారు. పలువురి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్ డీటైల్ రికార్డ్స్, ఐఎంఈఐ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ రికార్డులను ప్రవీణ్ డిలీట్ చేశారు.

ఎలక్ట్రీషియన్ సాయంతో ఎస్ఐబీ భవనంలో సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి హార్ట్ డిస్కులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.కాగా, విచారణ పూర్తయ్యే వరకూ అనుమతి లేకుండా డీఎస్పీ ప్రణీత్ హెడ్ క్వార్టర్స్‌ను వీడకూడదని సస్పెన్షన్ ఆర్డర్‌లో స్పష్టం చేశారు. కుట్రలో భాగంగానే సమాచారం మొత్తం ధ్వంసం చేసినట్లు గుర్తించిన పోలీసు శాఖ.. ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కీలక ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వైఖరిపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ విషయంలో సస్పెండ్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ కుమార్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా సోమవారం డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి ఆయనను ప్రభుత్వం అటాచ్ చేసింది.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications