Dubbaka bypoll results : పుంజుకుంటున్న టీఆర్ఎస్ ...మారుతున్న ట్రెండ్ .. బీజేపీ నేతల్లో టెన్షన్

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం టిఆర్ఎస్, బిజెపి నేతలకు టెన్షన్ పుట్టిస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి పది రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కొనసాగించగా కేవలం రెండు రౌండ్లలో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని చూపించింది. ఇప్పుడు నిదానంగా టీఆర్ఎస్ పుంజుకుంటున్నక్రమంలో బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు నమోదు అయిన పరిస్థితి కనిపిస్తుంది. టిఆర్ఎస్ కు 1008 ఓట్లు, బిజెపికి 492 ఓట్లు పోల్ అయినట్లుగా తెలుస్తోంది.

 దుబ్బాకలో ఆధిక్యంలో బీజేపీ ... ట్రెండ్ ఇలా

దుబ్బాకలో ఆధిక్యంలో బీజేపీ ... ట్రెండ్ ఇలా

మొదటి నుండి 5వ రౌండ్ వరకు బిజెపి ఆధిక్యంలో దూసుకు వెళ్లగా మొదటి ఐదు రౌండ్లలో కలిపి బిజెపికి 3020 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక ఐదు రౌండ్ల ముగిసిన తరువాత మొదటిసారిగా టిఆర్ఎస్ 6, 7 రౌండ్లలో కాస్త ఆధిక్యాన్ని కనబరిచింది .ఆరో రౌండ్ లో 353, ఏడో రౌండ్లోనూ 182 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.

ఇక 12 వ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక ఇప్పుడు తాజాగా మళ్లీ పదమూడవ రౌండ్ నుండి ఆధిక్యంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఈ రౌండ్ లో 304 ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 14 వ రౌండ్ లో 288 ఓట్ల ఆధిక్యాన్ని చూపించింది టిఆర్ఎస్ పార్టీ .

 16 రౌండ్లలో బిజెపి 1734 ఓట్లతో లీడ్ ..నిదానంగా పుంజుకున్న టీఆర్ఎస్

16 రౌండ్లలో బిజెపి 1734 ఓట్లతో లీడ్ ..నిదానంగా పుంజుకున్న టీఆర్ఎస్

ప్రస్తుతం 16 రౌండ్లు ముగిసేసరికి బిజెపి 1734 ఓట్లతో బీజేపీ లీడ్ లో ఉన్నప్పటికీ క్రమంగా అది తగ్గుతూ వస్తోంది. దీంతో బీజేపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ వ్యక్తమవుతోంది. రౌండ్ రౌండ్ కు బీజేపీ ఆధిక్యం తగ్గుతుండటంతో బీజేపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు .ఇప్పటి వరకు 1,17,310 ఓట్ల లెక్కింపు జరిగింది .ఇంకా 46, 882 ఓట్లు లెక్కించాల్సి ఉంది. కేవలం ఏడు రౌండ్లు లెక్కింపు మాత్రమే ఇంకా లెక్కింపు చేయాల్సి ఉన్న నేపథ్యంలో టిఆర్ఎస్ కు అనుకూలంగా మారుతున్న ట్రెండ్ బీజేపీ నేతలకు చెమటలు పట్టిస్తుంది.

Recommended Video

    Dubbaka Bypoll Result : BJP Aggression Creates TRS Tension On Future Elections
    దుబ్బాకలో గెలిస్తేనే బీజేపీకి బలం .. టెన్షన్ పడుతున్న నేతలు

    దుబ్బాకలో గెలిస్తేనే బీజేపీకి బలం .. టెన్షన్ పడుతున్న నేతలు

    తక్కువ మెజారిటీతో అయినా బిజెపి విజయం సాధిస్తే, భవిష్యత్తు ఎన్నికలలో బిజెపి కాస్త గట్టిగా అధికార పార్టీకి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ విషయంలోనే బిజెపి నేతలు టెన్షన్ పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి ఎవరు గెలిచినా భారీ మెజారిటీతో గెలిచి అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ దుబ్బాకలో విజయం బిజెపికి తెలంగాణలో పట్టు తీసుకువస్తుంది అని భావిస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి రౌండ్ గడుస్తున్నకొద్దీ టఫ్ గా మారడం బీజేపీ శ్రేణులకు టెన్షన్ పుట్టిస్తుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+