దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్..
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుండి గజ్వేల్ కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండు మూడు రోజులుగా గజ్వేల్ లో శివాజీ విగ్రహం వద్ద మూత్రవిసర్జన చేసిన ఘటనకు సంబంధించి ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గజ్వేల్ లో శివాజీ విగ్రహం వద్ద ఒక ముస్లిం మూత్ర విసర్జన చేసిన ఘటనతో స్థానిక హిందూ సంఘాల యువకులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం ధర్నా, ర్యాలీ నిర్వహించి తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్న క్రమంలో వారి పై గుర్తు తెలియని అగంతకులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక యువకుడు గాయపడగా, మరొక వ్యక్తి ఇది తప్పించుకున్నాడు. ఇక ఈ దాడి ఘటన తర్వాత గజ్వేల్ లో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. నిన్న గజ్వేల్ బంద్ కూడా నిర్వహించారు. పోలీసులు గజ్వేల్ లో భారీగా పోలీస్ బలగాలను మొహరించి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో మార్గమధ్యలో అడ్డుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రఘునందన్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. రఘునందన్ రావు తో ఫోన్ లో మాట్లాడారు ఈటల రాజేందర్. అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, బి ఆర్ ఎస్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణం రఘునందన్ రావును వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications