ప్రధాని మోడీ పర్యటన వేళ.. ప్రధాన డిమాండ్లతో కేటీఆర్ సంచలన ట్వీట్స్!!
తెలంగాణా రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన క్రమంలో మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నట్టు తెలంగాణా అధికార బీఆర్ఎస్ ప్రకటన చెయ్యటంతో రాష్ట్ర రాజకీయాలు హాట్ గా మారాయి. ఇప్పటికి ఎన్ని సార్లు ప్రధాని మోడీ తెలంగాణాకు వచ్చినా తెలంగాణా మోడీ పర్యటనను బహిష్కరించిన అధికార బీఆర్ఎస్ తాజా పర్యటనను టార్గెట్ చేస్తుంది.
ఇక ఎప్పుడు ప్రధాని మోడీ తెలంగాణా రాష్ట్రానికి వచ్చినా ప్రధాని మోడీకి సూటి ప్రశ్నలు సంధించే మంత్రి కేటీఆర్ తాజాగా కూడా మోడీ పర్యటన నేపధ్యంలో సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ లు చేశారు. తెలంగాణా రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది అని టార్గెట్ చేశారు.

బయ్యారంలో సమీకృత ఉక్కు కర్మాగారం కోసం తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 9 సంవత్సరాల తర్వాత, మరియు అనేక రిమైండర్‌ల తర్వాత కూడా, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొనసాగించిన తిరస్కరణ తీవ్ర నిరుత్సాహాన్ని కలిగిస్తుందని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు .
బయ్యారంలో ఇనుప ఖనిజం కోసం అవసరమైన భూమి, నీరు, విద్యుత్, బొగ్గు మరియు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి వరకు అన్ని వనరులు ఉన్నాయి. అయినా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో తెలంగాణ పట్ల మీకు కనిపిస్తున్న ఉదాసీనత ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇది 15,000 మంది స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలను నిరాకరించిందని వెల్లడించారు.కేంద్రం తీరు వల్ల తెలంగాణా నష్టపోతుందని తన ట్వీట్స్ ద్వారా తెలియజేశారు.

తెలంగాణ పర్యటనలో నేడు వరంగల్ వేదికగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి గట్టి ప్రతిజ్ఞ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతేకాదు తెలంగాణాకు రావలసిన లోకోమోటివ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు మళ్లించుకున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్‌కు రూ.20వేల కోట్ల ప్రాజెక్టులు, తెలంగాణకు రూ.520 కోట్ల ప్రాజెక్టా? అని ప్రశ్నించారు.
విభజన చట్టంలో లోకోమోటివ్ ఫ్యాక్టరీ ప్రస్తావించి, వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమే. దీనిపై మోదీ వివరణ ఇవ్వాలి అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మరి కేటీఆర్ చేసిన డిమాండ్లపై పీఎం మోడీ స్పందిస్తారా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications