ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..!!
తెలంగాణ అసెంబ్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్.. బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగింది. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో సభలో తీవ్ర దుమారం చెల రేగింది.. పనులు కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమీ షన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. దీని పైన స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దీంతో, రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది.
అసెంబ్లీ వేదికగా కేటీఆర్ - భట్టి మధ్య జరిగిన వాదన రెండు పార్టీల వివాదంగా మారింది. సభలో కేటీఆర్ మాట్లాడుతూ పనులు కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమీ షన్లు తీసుకుంటు న్నారనే ప్రచారం జరుగుతోందని చెప్పుకొచ్చారు. కేటీఆర్ చేసిన ఆరోపణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ గౌరవంగా మాట్లాడతాడని తాను ఊహించానని, కానీ అది తప్పని అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. దీంతో, ఒక్క సారిగా బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ పరణామంతో సభ వేడెక్కింది.

కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. లేదంటే సభలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీలా బరితెగించి రాజకీయాలు చేయడం లేదంటూ భట్టి ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు.. అడ్డగోలుగా దోచుకున్నది మీరు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ భట్టి హెచ్చరించారు. అయితే కేటీఆర్ చేసిన కామెంట్స్‌ను సభ రికార్డుల నుంచి స్పీకర్ తొలగించారు. అయితే కేటీఆర్‌పై భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఆ తరువాత కేటీఆర్ చేసిన 30శాతం కమీషన్ల వ్యాఖ్యలు స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.












Click it and Unblock the Notifications