వీసీలతో కడియం
హైదరాబాద్: శ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు తావులేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. యూనివర్శిటీల వీసీలతో నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడారు. విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా వీసీలు, అధ్యాపకులు పనిచేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాల పనితీరు మెరుగుపడేందుకే ఇటీవల వీసీలను నియమించామని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాలకు నిధులు ఆశించిన మేర లేవన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు.












Click it and Unblock the Notifications