వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలయాల్లో ఈ హుండీలు.. నేరుగా స్కాన్ చేసి కానుకలు.. ఇదికదా డిజిటల్ ఇండియా!!

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. బయటకు వెళితే నగదును తీసుకు వెళ్తున్న వారి సంఖ్య బాగా తగ్గింది. ఏటీఎం కార్డులు, ఫోన్ పే, గూగుల్ పే వంటి వనరుల ద్వారా చెల్లింపులు చకచకా జరిగిపోతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా గుడికి వెళితే హుండీలో డబ్బులు వేయడానికి ప్రస్తుతం జేబులు తడుముకోవాల్సిన వస్తుంది. డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయిన తర్వాత జేబులో డబ్బులు పెట్టుకుని తిరగడం గణనీయంగా తగ్గడంతో ఆలయాలకు వెళ్లి హుండీలో డబ్బులు వేయాలంటే ఆలోచించవలసి వస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఆలయాలలోనూ ఈ హుండీల విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్టు అనేక ఆలయాలలో ప్రస్తుతం ఏర్పాటుచేసిన డిజిటల్ చెల్లింపుల విధానంతో తెలుస్తుంది.

 ఆలయాలలో కానుకలకు డిజిటల్ చెల్లింపులు

ఆలయాలలో కానుకలకు డిజిటల్ చెల్లింపులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో, ఆలయాలలో హుండీ ఆదాయం తగ్గకుండా డిజిటల్ విధానంలో స్వామి వారికి కానుకలను వేయడానికి అన్ని ఆలయాలలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. గుడికి వెళ్ళిన తర్వాత కానుక వేయడానికి జేబులు తడుముకోకుండా, ఫోన్ తీసుకుని దర్జాగా డిజిటల్ చెల్లింపుల ద్వారా స్వామివారి కానుకలను వేసే విధానానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా నగదు రహిత సేవలను ప్రారంభించిన క్రమంలో అనేక ఆలయాలలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

తెలంగాణాలో చాలా ఆలయాల్లో క్యూఆర్ కోడ్ లు

తెలంగాణాలో చాలా ఆలయాల్లో క్యూఆర్ కోడ్ లు

ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా వెలగటూర్ మండలం లోని కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవాలయంలో గుడికి వచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని హుండీలో కానుకలు వేయడానికి క్యూ ఆర్ స్కాన్ ఏర్పాటు చేశారు. ఎవరైనా భక్తులు స్వామి వారికి కానుకలు ఇవ్వాలనుకుంటే ఫోన్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కానుకలు స్వామివారి హుండీకి జమ చేస్తే సరిపోతుంది. ఇక తాజాగా సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అధికారులు కూడా స్వామి వారి పేరుమీద బ్యాంకు ఖాతా తెరిచి క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేయించారు.

ఆలయాలలో ఆన్ లైన్ లో కానుకలు సమర్పించే వ్యవస్థ

ఆలయాలలో ఆన్ లైన్ లో కానుకలు సమర్పించే వ్యవస్థ

భక్తులు దైవదర్శనం చేసుకొని ఫోన్ ద్వారా క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఈ హుండీలో స్వామివారి కానుకలను సమర్పించుకుంటున్నారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలయాల్లో ఆన్లైన్ కానుకలను చెల్లించే వ్యవస్థను ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో మేడారం సమ్మక్క సారలమ్మలకు భక్తులు సమర్పించే కానుకలకు కూడా మేడారం సమ్మక్క సారలమ్మలకు ఈ హుండీలను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పెరిగిన డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు ప్రతీ చోట అమలవుతూ ఉండడం, ముఖ్యంగా ఆలయాల్లోనూ ఈ హుండీలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ హుండీలతో ఎన్నో ప్రయోజనాలు.. ఇది కదా డిజిటల్ ఇండియా

ఈ హుండీలతో ఎన్నో ప్రయోజనాలు.. ఇది కదా డిజిటల్ ఇండియా

ఈ హుండీల ఏర్పాటుతో స్వామివారి కానుకల లెక్కింపు సునాయాసమౌతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల లోనూ భక్తులు చెల్లించిన కానుకల లెక్క పక్కాగా ఉంటుంది. ఆలయాలలో హుండీల లెక్కింపు ప్రక్రియకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేసి, పటిష్టమైన నిఘా పెట్టి, అధిక సమయాన్ని వెచ్చించి చేయాల్సిన అవసరం లేకుండా ఈ హుండీ విధానంలో లెక్కింపు పారదర్శకంగా ఉంటుంది. మొత్తానికి ఆలయాలలోను డిజిటల్ చెల్లింపులతో ఇది కదా డిజిటల్ ఇండియా అన్న భావన ప్రతి ఒక్కరికి వస్తుంది.

English summary
A digital payment system is being implemented in Telangana temples to pay God's gifts. In many temples QR code is installed and E- hundis are being installed. Devotees coming to temples say this is Digital India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X