వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందస్తు ఎన్నికలా.. మునుగోడు ఉపఎన్నికనా.. ఏది బెస్ట్? టీఆర్ఎస్‌లో ఇంట్రెస్టింగ్ చర్చ; ఎందుకంటే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల కంటే ముందుగా మొత్తం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అన్న చర్చ టిఆర్ఎస్ పార్టీలో ఆసక్తికరంగా మారింది.

 మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ లో జోరుగా చర్చ

మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ లో జోరుగా చర్చ

మునుగోడు ఉపఎన్నికలో ఓటమి పాలైతే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడుతుందని, టిఆర్ఎస్ పార్టీ నుండి వలసలు బిజెపి లోకి కొనసాగే అవకాశం ఉందని టిఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో బిజెపి మరింత బలాన్ని పుంజుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతాయని భావిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రభావం, భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై కచ్చితంగా ఉంటుందని గెలిస్తే ఓకే కానీ, ఓడిపోతే పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని పార్టీ నేతలు అంతర్గత చర్చ జరుగుతుంది.

మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుంది.. చర్చ

మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుంది.. చర్చ

మునుగోడు ఉప ఎన్నికల తరువాత సాధారణ ఎన్నికలకు వెళితే మునుగోడు ఉపఎన్నిక ఫలితాల ప్రభావం ఆ ఎన్నికలపై ఖచ్చితంగా కనిపిస్తుందని టిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. మునుగోడు లో బీజేపీ విజయం సాధిస్తే నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బిజెపి కి బలం పెరుగుతుంది అన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక బీజేపీ మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ మరింత బలోపేతం అవుతుందని, అప్పుడు సాధారణ ఎన్నికలలో బిజెపిని ఎదుర్కోవడం కష్టమవుతుందని టిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

 బండి సంజయ్ వ్యాఖ్యలతో మరింత ఆందోళన

బండి సంజయ్ వ్యాఖ్యలతో మరింత ఆందోళన

అందుకే ముందస్తు ఎన్నికలా? మునుగోడు ఉపఎన్నికనా అంటూ టిఆర్ఎస్ శ్రేణులు చర్చిస్తున్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత, తమ్ముడు బాటలో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు అన్న చర్చ నల్గొండ జిల్లాలో ఊపందుకుంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 12 స్థానాలకు ఉప ఎన్నికలు రావడం ఖాయమని చేసిన వ్యాఖ్యలు కూడా టిఆర్ఎస్ పార్టీలో ఆందోళనకు కారణంగా మారాయి.

గత ఉపఎన్నికలలో బీజేపీ విజయంతో బలహీనపడిన టీఆర్ఎస్

గత ఉపఎన్నికలలో బీజేపీ విజయంతో బలహీనపడిన టీఆర్ఎస్


రాష్ట్రంలో పరిణామాలు ప్రతికూలంగా మారకముందే టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే బాగుంటుందేమో అన్న చర్చ కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ తీశాయి. రాష్ట్రంలో బిజెపి బలం పుంజుకోవడానికి,టిఆర్ఎస్ కాస్త బలహీనపడటానికి గత ఉపఎన్నికలు కారణంగా కనిపించాయి. ఇక ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో కూడా బిజెపి విజయం సాధిస్తే టిఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడి ఇబ్బంది పడాల్సి వస్తుందని, వలసల ప్రమాదమ ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ముందస్తు బెస్టా... మునుగోడు ఉపఎన్నిక బెస్టా ... చర్చ

ముందస్తు బెస్టా... మునుగోడు ఉపఎన్నిక బెస్టా ... చర్చ


ఈ క్రమంలోనే ముందస్తుపై సీఎం కెసిఆర్ సమాలోచనలు చేస్తున్నట్టుగా ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా చెప్పుకున్న టిఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. బిజెపి ఎత్తుగడలను చిత్తు చేసే వ్యూహాలను రచిస్తూ తలమునకలవుతోంది. ముందస్తు బెస్టా... మునుగోడు ఉపఎన్నిక బెస్టా అన్న చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతుంది. ఇక బీజేపీ అధినాయకత్వం ఆదేశాలతో, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సూచనలతో తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళుతుంది.

English summary
There is a debate going on in TRS as to whether it will be better if we go to early elections or if we go to munugodu by-elections. In the context of the latest political developments, fear with bjp in trs circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X