హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సోమవారం రాత్రి జగద్గిరిగుట్టలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

రాత్రి 10.20 నిముషాల సమయంలో రెండు సెకన్లపాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఏం జరిగిందో తెలియక కొంతసేపు వారంతా ఆందోళనకు గురయ్యారు.

Earthquake

జగద్గిరిగుట్ట చివరి బస్టాపు, దేవమ్మబస్తీ, పాపిరెడ్డినగర్‌, గుబురుగుట్ట, బీరప్పనగర్‌, సంజయ్‌పురి, అంజయ్యనగర్‌, జగద్గిరినగర్‌, మైసమ్మనగర్‌, రాజీవ్‌గృహకల్ప సముదాయాల్లో భూమి స్వల్పంగా కంపించింది.

ఘటన జరిగినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు ఆయా బస్తీల్లో జనమంతా వీధుల్లోనే నిలబడి కనిపించారు. అయితే, ఈ భూ ప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+