తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లు ఎన్ని..!!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు పార్టీల మధ్య హోరా హోరీగా మారుతోంది. మెజార్టీ సీట్లు గెలవటం పైనే మూడు పార్టీలు ఫోకస్ చేసాయి. ఎన్నికల తరువాత తామే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సారి బీజేపీ గెలిచే సీట్లు పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 14 సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. బీఆర్ఎస్ సైతం ఎక్కవ సీట్లు గెలుస్తామని విశ్వాసంతో కనిపిస్తోంది.
తెలంగాణలో మూడ పార్టీలు క్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేది తామంటే తామేనంటూ పోటీ పడుతున్నాయి. తెలంగాణలో 13 నుంచి 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనావేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే, బీజేపీ 12 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు. మోదీ పాలనలో భారత్‌లో హింసకు తావులేకుండా ప్రశాంతకు నిలయంగా మారిందన్నారు. ప్రపంచంలోనే స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్‌గా మోదీ ఎదిగారన్నారు.

బీఆర్ఎస్ కి రెండోసారి ప్రజలు అధికారం ఇస్తే..అహంకారంతో వ్యవహించారని ఈటల విమర్శించారు. సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తక్కువ సమయంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీకి ఓటేశారని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ బీజేపీ సత్తా చాటుతుందన్నారు. అయితే, మూడు పార్టీలు తమకు వచ్చే సీట్ల పైన భారీగా అంచనాలు వ్యక్తం చేస్తండటంతో అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications