వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి ఎన్నికల సంఘం షాక్ - సీఎం కేసీఆర్ కు మద్దతుగా..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు వేడెక్కాయి. ఒక పార్టీని మరో పార్టీ టార్గెట్ చేస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రచారాలు మొదలు పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న ప్రచారం పైన ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి.

సీఎం కేసీఆర్ లక్ష్యంగా ప్రచారం

సీఎం కేసీఆర్ లక్ష్యంగా ప్రచారం


ఆ సమయంలో టీఆర్ఎస్ ప్రధానికి వ్యతిరేకంగా ప్రచార హోర్డింగ్ లు ఏర్పాటు చేసింది .దీంతో..కౌంటర్ గా బీజేపీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి కొన్ని స్లోగన్స్ తో బోర్డులు ఆవిష్కరించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా పని చేసిన తరుణ్ చుగ్ వీటిని ప్రారంభించారు. అందులో 'సాలు దొర‌- సెలవు దొర' అంటూ ఎన్నికలకు కౌంట్ డౌన్ సూచిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. దీంతో ఈ ప్రచారం కొనసాగించేందుకు బీజేపీ ఎన్నికల సంఘం అనుమతి కోరింది. ఎన్నికల సమయం కాకపోవటంతో దీని పైన ఎన్నికల నుంచి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది.

ఎన్నికల సంఘం ఆదేశాలు

ఎన్నికల సంఘం ఆదేశాలు


అదే సమయంలో సీఎం బొమ్మతో బీజపీ పోస్టర్లు ముద్రించటం పైనా ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. తాజాగా.. బీజేపీ తాము నిర్వహిస్తున్న సాలు దొర- సెలవు దొర క్యాంపెయిన్ కు అనుమతి ఇవ్వాలంటూ చేసిన దరఖాస్తును ఎన్నికల సంఘం తోసి పుచ్చింది. ఈ ప్రచారాన్ని వెంటనే నిలిపి వేయాలని ఎన్నికల సంఘం బీజేపీకి సూచించింది. బీజేపీ చేస్తున్న ప్రచారం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక దిశగా అన్ని ప్రధాన పార్టీలు సిద్దం అవుతున్నాయి.

పార్టీల్లో మునుగోడు హీట్

పార్టీల్లో మునుగోడు హీట్


బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ నుంచి అభ్యర్ధి ఎంపిక పైన కసరత్తు కొనసాగుతోంది. అభ్యర్ధి పైన నిర్ణయం తీసుకున్న తరువాత అభ్యంతరాలు రాకుండా ముందుగానే నియోజకవర్గానికి చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశాలు కొనసాగుతున్నాయి. అటు, కాంగ్రెస్ లో మునుగోడు బై పోల్ వేడి పుట్టిస్తోంది. సీటు కోసం అధినాయకత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. సర్వలే నివేదిక ఆధారంగా టికెట్ ఖరారు చేస్తామని చెబుతున్న పార్టీ నాయకత్వం...నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.

English summary
Election commission suggested BJP leaders to stop campaign against CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X