జగన్ జగతి కేసును బదిలీ చేయండి: కోరిన ఈడి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులలో జగతి పెట్టుబడుల కేసును ఆర్థిక నేరాల కోర్టుకు బదిలీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టును కోరింది. ఈ మేరకు రూ.34.65 కోట్ల పెట్టుబడులపై మనీలాండరింగ్ చట్టం ప్రకారం విచారణ కోసమే ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తన పిటిషన్‌లో ఈడీ తెలిపింది.
సీబీఐ దర్యాప్తు పూర్తిచేసిన ఈ కేసును తమశాఖ కోర్టుకు బదిలీ చేయాలని లోగడ ఈడీ అధికారులు కోరగా సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే పీఎంఎల్ చట్టంలోని సెక్షన్ 44(1)(సి)ని అన్వయిస్తూ తాజాగా ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.

ఇక ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడైన శ్రవణ్ గుప్తా విదేశీ ప్రయాణానుమతి సెప్టెంబర్ 2తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా విజ్ఞప్తి మేరకు ఆర్నెల్లు పొడిగిస్తూ సీబీఐ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగతి పబ్లికేషన్స్‌లో టీఆర్ కన్నన్, మాధవ్ రామచంద్ర, ఎకె దండమూడిలు పెట్టిన రూ.34.65 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసు సిసి 9/2ను ఈడి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరింది.
ఇదిలావుంటే, వ్యాపార వ్యవహారాల నిమిత్తం మరో ఆరు నెలల పాటు విదేశాలకు వెళ్లడానికి ఎమ్మార్ కేసులో నిందితుడైన శ్రవణ్ గుప్తాకు సోమవారం సిబిఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications