జగన్, విజయసాయిరెడ్డిలకు మరో షాక్: పెన్నా సిమెంట్స్ ఛార్జీషీటులో సమన్లు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం మరో షాక్ తగిలింది. పెన్నా సిమెంట్స్ ఛార్జీషీటును ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది.
చదవండి: జగన్ కంపెనీల్లోకి రూ.70 కోట్లు: ఇందూ కేసు.. జగన్-విజయసాయిలకు సీబీఐ షాక్
ఈ అంశంపై మార్చి 16న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ జరిగిందంటూ సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీటులో నిందితులుగా విజయ సాయిరెడ్డి, పెన్నా గ్రూప్ అధినేత ప్రతాప్ రెడ్డికి కూడా సమన్లు ఇచ్చింది.

దీనికి సంబంధించి వేరే కేసులు కూడా అదే రోజు విచారణకు వస్తుండంతో విచారణకు రావాలని ముగ్గురికీ సమన్లు ఇచ్చింది. ఇందూ టెక్ విషయంలోను ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications