ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ
హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ముగిసింది. మీడియా కంట పడకుండా బుధవారం ఉదయం 8 గంటలకే అమోయ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంల వరకు ఏడున్నర గంటపాటు సుదీర్ఘంగా ఈడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
గతంలో రంగారెడ్డి జిల్లా భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న కేసులో అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై ఈడీ విచారణ కొనసాగుతోంది. రూ.100ల కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని అక్రమంగా బదిలీ చేశారని అమోయ్ కుమార్ ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది.

గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా అమోయ్ పనిచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అమోయ్ కుమార్ పాత్రపై నిజానిజాలు తేల్చేందుకు ఆయనను ఈడీ విచారిస్తోంది. కాగా, ఇదే అంశంలో తహసీల్దార్ జ్యోతి, ఆర్డీవో ఇతర సిబ్బంది చేసిన అవకతవకలపైనా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. భూదాన్ భూముల్లో జరిగని అవకతవలపై మీ దగ్గర న్న సమాచారాన్ని ఇవ్వాలని అమోయ్ కుమార్ ను ఈడీ కోరినట్లు తెలిసింది.
అంతేగాక, భూములు ఏ విధంగా బదిలీ చేశారు, ఎవరెవరికి బదిలీ చేశారు, ఎవరి ఒత్తిడితో ఈ వ్యవహారం కొనసాగింది తదితర అంశాలపై అమోయ్‌కుమార్‌ను అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత ఆయన తన న్యాయవాదితో కలిసి తిరిగి వెళ్లిపోయారు. అయితే, గురువాంర మరోసారి అమోయ్‌కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications