Eetala Rajender: కేసీఆర్‍కు తెలంగాణతో ఉన్న బంధం తెగిపోయింది..
ఉద్యమ పార్టీని కతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపనతోనే తెలంగాణాకి కేసీఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం ముగిసిపోయిందన్నారు.
మద్యం, డబ్బు
జాతీయ పార్టీ ప్రకటనతో తెలంగాణఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత కేసీఆర్ మద్యం, డబ్బు నమ్ముకుంటారని చెప్పారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయం చెలామణి చేయాలని కల పగటికలకంటున్నారని ఆరోపించారు.

దేశ రాజకీయాలు
తెలంగాణలో ఉన్న సమస్యలు పరిష్కరించలేనివాడు.. దేశ రాజకీయాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ పార్టీ ఉండాలో ప్రజలే తీర్పు చెబుతారని అన్నారు.












Click it and Unblock the Notifications