39మంది పోలీసులపై వేటు వేస్తూ పోలీస్ శాఖ సంచలనం.. మ్యాటర్ ఇదే!

తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఆందోళనలు ఉధృతం అవుతున్న వేళ తెలంగాణ పోలీస్ శాఖ దీనిని సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు బెటాలియన్ లకు చెందిన కానిస్టేబుల్స్ , కానిస్టేబుల్స్ కుటుంబాలు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ వారి పైన వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్స్ సస్పెన్షన్
పోలీస్ డ్యూటీ పేరుతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా వన్ స్టేట్ వన్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కానిస్టేబుల్స్ కుటుంబాలు, కానిస్టేబుల్స్ బెటాలియన్స్ వారిగా ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో మొత్తం అనేక బెటాలియన్లకు సంబంధించి 39 మంది కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలంగాణ పోలీస్ శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.నిరసనలకు ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని అలాంటి వారి పైన చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తర్వులలో పేర్కొంది.

Effect of agitations for one police policy on 39 police constables suspension

సస్పెండ్ అయిన కానిస్టేబుల్స్ బెటాలియన్స్ వారీగా
సస్పెన్షన్ కు గురైన వారిలో ఆరుగురు మూడవ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్స్ ఉన్నారు .17వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్స్ ఆరుగురు, మామునూరు నాలుగో బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్స్ ఆరుగురు, 5వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్స్ ఆరుగురు, ఆరవ బెటాలియన్ లో ఐదుగురు, 12వ బెటాలియన్లో ఐదుగురు, 13వ బెటాలియన్ లో ఐదుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు.

39 మందిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు
మొత్తం 39 మందిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన పై డీజీపీ జితేందర్ స్పందించారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖ లో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. పాత విధానం అమలు చేస్తామని చెప్పినప్పటికీ కానిస్టేబుల్స్ ఆందోళన చేయడం సరికాదన్నారు.

చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు
ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని అనుమానం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆందోళనలు విరమించకుంటే ఇలాగే ఆందోళనలలో పాల్గొనే వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక బెటాలియన్ కానిస్టేబుల్స్ సస్పెన్షన్ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించి కానిస్టేబుల్స్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసింది.

వన్ పోలీస్ విధానం కోసం కానిస్టేబుల్స్ డిమాండ్
అలాగే కానిస్టేబుల్ లకు సెలవులపై పాత విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మొత్తంగా కానిస్టేబుల్స్ ఆందోళనల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారగా ఒకే పోలీస్ విధానం కోసం కానిస్టేబుల్స్ గట్టిపట్టు పడుతున్నారు. మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+