ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం.!టీడిపి, వైసీపీకి ప్రత్యమ్నాయం గులాబీ పార్టీనే అంటున్న తోట.!
అమరావతి/హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీలకు గులాబీ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయమని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.ఆంధ్ర ప్రజలను ఆ రెండు పార్టీలు మోసగించాయని తోట చంద్ర శేఖర్ విమర్శించారు.గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని డాక్టర్ తోట ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు పార్టీ కార్యాలయంలో పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తోట మాట్లాడారు. టిడిపి, వైసీపీ పార్టీలు రాష్ట్రాన్ని ఆథోగతి పాలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధాని నిర్మాణంలో ఆ రెండు పార్టీలు విఫలం : టిడిపి వైఫల్యాలతో విసుగెత్తిన ప్రజలకు మరే ప్రత్యామ్నాయం లేక వైసీపికి ప్రజలు ఓటేసారని అన్నారు. అభివృద్ధి శూన్యం, అప్పులు ఘనం అన్న చందంగా ఏపీ పరిస్తితి దయనీయంగా మారిందని తోట ఆవేదన వ్యక్తం చేసారు. ఆకాల వర్షాలతో అతాలకుతలమైన రైతాంగాన్న ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండిపడ్డారు. 31 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వైసీపి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదిసిన దాఖలాలు లేవన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేస్తుంటే అంత మంది ఎంపీలు ఉండి ఏం మాట్లాడటంలేదని ఎద్దేవాచేసారు.

ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం : బీఆర్ఎస్ తరుఫున ఏపీకి చెందిన వారే సీఎం అవుతారనే విషయాన్ని ఏపీ ప్రజలు గుర్తించుకోవాలన్నారు తోట. ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రశేఖర్ రావు ప్రధాని కాగానే వాటిని తిరిగి వెనక్కి తీసుకుంటామనే అంశాన్ని చంద్రశేఖర్ రావు గతంలో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ దేశానికి నాయకత్వం వహించే సత్తా కేవలం చంద్రశేఖర్ రావుకు మాత్రమే ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయం ఏమైందని వైసీపిని తోట ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏమయ్యాయని తోట నిలదిశారు.













Click it and Unblock the Notifications