హైదరాబాద్‌లో 2,351 ఏళ్ల ఈజిప్ట్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక 'మమ్మీ' (వీడియో)
హైదరాబాద్: ఈజిప్టులో రాజ కుటుంబీకులు చనిపోతే వారి శరీరాలను మమ్మీలుగా మార్చే పద్ధతి అందరికీ తెలిసిందే. నాంపల్లిలోని స్టేట్ మ్యూజియంలో కూడా అలాంటి మమ్మీ ఉంది. 2351 ఏళ్ల నాటి ఈ మమ్మీని ఈ మ్యూజియంలో చూడవచ్చు.
దీనిని ఈజిప్టు దేశపు ఆరో ఫారో 18 సంవత్సరాల కుమార్తెగా భావిస్తున్నారు. దేశంలోని మ్యూజియాల్లో ఉన్న ఆరు మమ్మీల్లో ఇది ఒకటి. 1920లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అల్లుడు నవాబ్ జంగ్ ఈ మమ్మీని వెయ్యి పౌండ్లకు కొనుగోలు చేసి, నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు బహూకరించాడు.

దీనిని 1930లో మ్యూజియానికి అలీఖాన్ ఇచ్చాడు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏడో నిజాం. మ్యూజియంలో ఉన్న మమ్మీ ముఖం, భుజాలు, బొటన వేలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఈజిప్ట్ పురావస్తు, పరిరక్షణ నిపుణులు తారిక్ అల్ అవాడీ ఆరేళ్ల క్రితం దీనిని సందర్శించారు. మమ్మీ సంరక్షణ కోసం పలు సూచనలు చేశాడు.












Click it and Unblock the Notifications