Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మావోయిస్టుల హతం: చిన్న వయసులోనే అడవుల్లోకి వెళ్లిన సోనీ(పిక్చర్స్)

బీజాపూర్/ఖమ్మం: చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొచ్చెలంక అటవీప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో 8మంది మావోయిస్టులు హతమయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీసుస్టేషన్‌ పరిధిలోని బొట్టెంతోంగు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ ప్రాంతం ఖమ్మం జిల్లా సరిహద్దుకు సుమారు 30 కి.మీ దూరంలో ఉంది. ఎన్‌కౌంటర్లో మరణించిన 8 మంది మావోయిస్టుల్లో ఐదుగురు మహిళలున్నారు.

మృతుల్లో దండకారణ్యం(డీసీ) స్పెషల్‌ జోనల్‌కు చెందిన ఫస్ట్‌ బెటాలియన్‌ సభ్యుడు లక్ష్మణ్‌(52) అలియాస్‌ గొట్టెముక్కల రమేశ్‌(గుంటూరు జిల్లా బాపట్ల), డీసీ సభ్యురాలు సోనీ అలియాస్‌ యూసఫ్‌బీ(40) (మెదక్‌ జిల్లా మాచినపల్లి), రాజు(25) (ఛత్తీస్‌గఢ్‌)లను గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది.

మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అవుతున్నారనే నిఘా వర్గాల పక్కా సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. గత రెండు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు పామేడు పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం మావోయిస్టులను పసిగట్టాయి.

అయితే మావోయిస్టులు ప్రతిఘటించడంతో గ్రేహౌండ్స్ కూడా కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మహిళా నక్సల్స్ సహా 8 మంది మావోయిస్టులు నేలకొరిగారు. సంఘటన స్థలంలో 5 ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఒక ఏకే-47 అత్యాధునిక తుపాకులు లభ్యం కావడంతో మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉంటారని భావించారు.

ప్రధానంగా తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, అతని భార్య జెజ్జెర సమ్మక్క అలియాస్ సోనీ అలియాస్ శారదతో పాటు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి కుంజా వీరన్న అలియాస్ లచ్చన్నలు ఉన్నారనే ప్రచారం జరిగింది.

కాగా, మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నం భద్రాచలంకు హెలికాప్టర్‌ ద్వారా తీసుకొచ్చారు. మృతదేహాల తరలింపులో అత్యంత నాటకీయత చోటుచేసుకుంది. మధ్యాహ్నం సమయంలో ఒక హెలికాప్టర్‌ పొగాకు బోర్డు హెలీప్యాడ్‌ వద్ద దిగింది. ఈ సమయంలో మరోరెండు హెలికాప్టర్లు గగనమార్గంలో చక్కర్లు కొట్టాయి. కిందకు వచ్చిన హెలికాప్టర్‌లోకి మంచినీళ్లు, ఆహార పదార్థాలను అక్కడున్న పోలీసులు తీసుకువెళ్లారు.

కొద్దిసేపట్లోనే ఇది పైకి వెళ్లిపోయింది. దీనిని మరోరెండు హెలికాప్టర్లు అనుసరించాయి. మృతదేహాలు రావడానికి చాలా సమయం పడుతుందని భావించిన జనం అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో.. అరగంటలోనే మళ్లీ హెలికాప్టర్లు ఇక్కడ చక్కర్లు కొట్టాయి. ఓ హెలికాప్టర్‌ కిందకు దిగింది. అందులో ఉన్న మృతదేహాలు, ఆయుధాలు, ఇతర సామగ్రిని హుటాహుటిన కిందకు దించారు.

ప్రత్యేక అంబులెన్సులో మృతదేహాలను పోస్టుమార్టం గదికి తరలించారు. టార్పాలిన్లలో మృతదేహాలను చుట్టి కర్రకు కట్టినందున... వీరి ముఖాలు పూర్తిగా ఎవ్వరికీ కనిపించలేదు. వీరిని గుర్తుపట్టేందుకు కొంతమందిని ముసుగులేసి తీసుకువచ్చినప్పటికీ.. వారు మృతదేహాలను గుర్తుపట్టలేకపోయినట్లు తెలిసింది. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.కోటిరెడ్డి పర్యవేక్షణలో ఏడుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. దీనిని వీడియో ద్వారా చిత్రీకరించారు.

బుధవారం మరో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను.. వరంగల్ జిల్లాకు చెందిన సృజన, సారక్కలుగా పోలీసులు గుర్తించారు.

భారీ ఎన్‌కౌంటర్

భారీ ఎన్‌కౌంటర్

చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మళ్లీ అలజడి మొదలైంది.

భారీ ఎన్‌కౌంటర్

భారీ ఎన్‌కౌంటర్

ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొచ్చెలంక అటవీప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో 8మంది మావోయిస్టులు హతమయ్యారు.

భారీ ఎన్‌కౌంటర్

భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీసుస్టేషన్‌ పరిధిలోని బొట్టెంతోంగు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

భారీ ఎన్‌కౌంటర్

భారీ ఎన్‌కౌంటర్

ఈ ప్రాంతం ఖమ్మం జిల్లా సరిహద్దుకు సుమారు 30 కి.మీ దూరంలో ఉంది. ఎన్‌కౌంటర్లో మరణించిన 8 మంది మావోయిస్టుల్లో ఐదుగురు మహిళలున్నారు.

భారీ ఎన్‌కౌంటర్

భారీ ఎన్‌కౌంటర్

మృతుల్లో దండకారణ్యం(డీసీ) స్పెషల్‌ జోనల్‌కు చెందిన ఫస్ట్‌ బెటాలియన్‌ సభ్యుడు లక్ష్మణ్‌(52) అలియాస్‌ గొట్టెముక్కల రమేశ్‌(గుంటూరు జిల్లా బాపట్ల), డీసీ సభ్యురాలు సోనీ అలియాస్‌ యూసఫ్‌బీ(40) (మెదక్‌ జిల్లా మాచినపల్లి), రాజు(25) (ఛత్తీస్‌గఢ్‌)లను గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది.

భారీ ఎన్‌కౌంటర్

భారీ ఎన్‌కౌంటర్

మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అవుతున్నారనే నిఘా వర్గాల పక్కా సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.


చిన్న వయసులోనే అడవుల్లోకి వెళ్లిన సోనీ

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన యూసుఫ్ బీ అలియాస్ సోనీది మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం మాచిన్‌పల్లి. ఆమె తన 16వ యేటనే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితురాలైంది. 1993లో ఇందుప్రియాల్ దళ సభ్యురాలిగా చేరి, 2001లో దళ కమాండర్‌గా ఎదిగింది.

2002లో నల్లమల విభాగానికి వెళ్లి.. మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా బోర్డర్ కార్యదర్శిగా పని చేసింది. ఇప్పుడు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ ఏరియా కమిటీ కార్యదర్శిగా కొనసాగుతూ.. తాజా ఎన్‌కౌంటర్‌లో మరణించింది. యూసుఫ్ బీ అలియాస్ భాగ్యక్క అలియాస్ము నీబీగా కొనసాగిన సోనీ.. 23ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉంది. కాగా, ఆమెపై రూ. 5లక్షల రివార్డు కూడా ఉంది.

మావోయిస్టు సిద్ధాంతాలకు ప్రభావితమైన లచ్చన్న

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గొట్టిముక్కల రమేష్ అలియాస్ లచ్చన్న(48) స్వగ్రామం గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు. క్రోసూరులో 10వ తరగతి, ఇంటర్ చదువుకున్న రమేష్.. అగ్రికల్చర్ సైన్స్‌లో డిగ్రీ చేసేందుకు హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో చేరాడు. అక్కడే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ప్రభావితుడై 1990లో ఉద్యమంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. కాగా, మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+