రైతు బంధు పంపిణీ కి బ్రేక్ - ఈసీ కీలక నిర్ణయం..!!
తెలంగాణ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రైతుబంద్ నిలిపివేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుతూ..నిధుల విడుదల కు రెండు రోజుల క్రితం ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన ఎన్నికల కమిషన్. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకుంది. మరో 48 గంటల్లో ప్రచారం ముగియనుంది. తెలంగాణలోని 70 లక్షల మంది రైతులకు సంబంధించి నిధల విడుదలకు రెండు రోజుల క్రితం ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతి ఉపసంహరించుకుంది. బీఆర్ఎస్ నేత..హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో రైతు బంధు వస్తుందని పదే పదే ప్రచారం చేయటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. రైతు బంధు అనుమతులను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించిన ఎన్నికల సంఘం. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందంటూ అనుమతులు రద్దు చేసిన ఈసీ. తాము ఇస్తామంటే విపక్షాలు రచ్చ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. రైతు బంధుపై పలు అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

దీంతో, తాజాగా రైతు బంధు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసిన ఎన్నికల కమిషన్ వెంటనే నిధుల జమ నిలిపి వేయాలని స్పష్టత ఇచ్చింది. 28వ తేదీ 70 లక్షల రైతుల ఖాతాల్లో సుమారు 7 వేల కోట్ల రూపాయలు రైతుబంధు నిధులు వేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలుపుదల చేయాల్సి వస్తోంది. దీంతో, రైతుల ఖాతాల్లో నగదు జమ ఆగిపోయింది. ఈ నెల 30 వరకు నగదు జమ చేయవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ విషయం పైన బీఆర్ఎస్ నేతలు మరోసారి ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications