తెలంగాణాలో జ్యోతిష్యం ప్రకారమే ఎన్నికలు: ఇప్పుడు కూడా గ్రహాలన్నీ ఒకేవరుసలోకి రావాలేమో: సుప్రీం ధర్మాసనం!!
తెలంగాణ రాష్ట్రంలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి అంటూ సుప్రీం ధర్మాసనం చమత్కరించింది. తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలను ఉద్దేశించి సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు చెయ్యటానికి కారణం ఏమిటి అంటే .. గోషామహల్ నుండి పోటీ చేసి గెలిచిన రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలంటూ టీఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ పై దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ. రామ సుబ్రమణియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని టిఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో రాజా సింగ్ అన్ని వివరాలను పొందుపరచలేదని, ఈ కారణంగా ఆయనపై అనర్హత వేటు వెయ్యాలని పిటీషన్ వేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ వి రామ సుబ్రమణియన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

2018 ఎన్నికలలో గోషామహల్ నుండి బిజెపి తరఫున పోటీ చేసి గెలిచిన రాజా సింగ్ ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పూర్తిగా పొందుపరచ లేదని ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. నిన్న విచారణ జరిగిన క్రమంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2018 ఎన్నికల నాటి నోటిఫికేషన్ లో మరికొన్ని వివరాల సమర్పణకు మూడు వారాల సమయం కావాలని అప్పటివరకు కేసు విచారణను వాయిదా వేయాలని, సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ వి రామ సుబ్రమణియన్ తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం 2018 లో ముందస్తుగా ఎన్నికలు వచ్చాయి. అక్కడ జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ కేసును కూడా విచారించాలి అంటే గ్రహాలన్నీ ఒక వరుసలోకి రావాలేమో అంటూ చమత్కరించారు. ఆపై ఈ కేసు విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామ సుబ్రమణియన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications