హమ్మయ్య.. ఎట్టకేలకు సమ్మె తప్పింది... డిమాండ్లకు యాజమాన్యం ఓకే...
హమ్మయ్య.. మరో సమ్మె తప్పింది. యాజమాన్యంతో విద్యుత్ కార్మిక సంఘాల చర్చలు సఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లు ఆమోదయోగ్యమని యాజమాన్యం సంకేతాలు ఇచ్చాయి. దీంతో విద్యుత్ కార్మిక సంఘాల సమ్మె ఆలోచనను విరమించుకున్నాయి. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

డిమాండ్లకు ఓకే..
ఆర్టిజన్ల డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని విద్యుత్ కార్మిక సంఘాలు మీడియాకు తెలిపాయి. కార్మికుల ఒక్కొ సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్యం తెలిపింది. తమ డిమాండ్లు ఒక్కొటి నెరవేరనుండటంతో సమ్మె చేయాలనే ఆలోచనను కార్మిక సంఘాలు విరమించుకున్నాయి.

మళ్లీ జీపీఎఫ్
విద్యుత్ ఉద్యోగులకు ఇదివరకు అమలుచేసిన జీపీఎఫ్ విధానాన్ని కొనసాగించేందుకు యాజమాన్యం అంగీకరించింది. వచ్చే నెల మూడోవరంలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో మరోసారి చర్చలు జరుపుతామని కార్మిక నేతలు చెప్తున్నారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ.. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ (టీటఫ్) పేరుతో ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. టీటఫ్ కింద 21 యూనియన్లు ఉన్నాయి. ఇందులో స్వతంత్ర యూనియన్, ఐఎన్టీయూసీ, జెన్ కో, సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ 82, ఐఎఫ్టీయూ, బీ2841, అన్‌మ్యాన్డ్ వర్కర్క్ యూనియన్, స్పాట్ బిల్లర్స్ వర్కర్స్ యూనియన్, ప్రైవేట్ కలెక్షన్ ఏజెంట్స్ యూనియన్, స్టోర్స్ అండ్ హమాలీస్ యూనియన్, ఎస్పీఎం కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, హెచ్ 42 ఉన్నాయి.

48 వేల మంది వారే
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు 50 వేల మంది ఉన్నారు. అయితే టీటఎఫ్ కింద 48 వేల మంది ఉద్యోగులు ఉండటం విశేషం. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం పరిధిలో 2 వేల మంది కార్మికులు ఉన్నారు. చర్చల్లో ఈ యూనియన్ నేతలు కీ రోల్ షోపించారా అనే అనుమానం నెలకొంది.

ఆర్టీసీలో సమ్మె..
మరోవైపు గత 15 రోజుల నుంచి ఆర్టీసీ కార్మిక జేఏసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఐఆర్, పీఆర్సీ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగా శనివారం ఆర్టీసీ కార్మిక జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ప్రధాన పార్టీలు మద్దతు తెలిపాయి. విపక్ష నేతలు ర్యాలీలు తీయగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications