కబళిస్తున్న కరోనా.!ఖాళీ అవుతున్న నగరం.!ఏ కాలనీ చూసినా టు-లెట్ బోర్డులే.!

హైదరాబాద్ : నగర వాసులపై కరోనా ప్రకోపాన్ని ఉదృతంగానే చూపించినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోడంతో సగటు సామాన్య పౌరుడి జీవనం కూడా కష్టాలపాలైంది. మాల్స్, థియేటర్స్, వస్త్ర దుకాణాలు, చిరువ్యాపారులు, హోటల్స్, మెస్సులు, కర్రీ పాయింట్స్, ప్రయివేటు సంస్థలు.. ఇలా అనేక రంగాల్లో పని చేసి జీవనోపాది వెళ్ల దీసుకుంటున్న వారి జీవితాల మీద కరోనా ఉక్కుపాదం మోపింది. పైన పేర్కొన్న అన్ని రంగాల వారి ఉద్యోగాలు ఊడిపోవడంతో ఆగమ్యగోచరంలో పడిపాయారు నగర ప్రజలు. ఉద్యోగం లేక, ఆదాయ మార్గంలేక బ్రతుకులు ప్రశ్నార్ధకంగా మారాయి.

Recommended Video

    Corona Impact: Empty Cities, To-Let Boards నగరంలో ఏ కాలనీ చూడు టు-లెట్ బోర్టులే !
    కరోనా వల్ల ఉద్యోగం ఉపాది పోయింది.. స్వచ్చందంగా స్వగ్రామాలకు వెళ్తున్న జనాలు..

    కరోనా వల్ల ఉద్యోగం ఉపాది పోయింది.. స్వచ్చందంగా స్వగ్రామాలకు వెళ్తున్న జనాలు..

    దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో నెట్టుకొచ్చే బదులు సొంతూర్లలో ఏదో ఒక పని చేసుకుని ఐన వాళ్ల మద్య బ్రతకొచ్చని సొంతూళ్లకు పయనమవుతున్నారు నగర ప్రజలు. దీంతో నగరంలో ఒకప్పుడు కిరాయికి ఉందామంటే ఇల్లు దొరకడం మహా గగనంగా ఉండేది. ఒకప్పుడు నగరంలో తలదాచుకునేందుకు ఇల్లు దొరికిందంటే అది ఓ సాహసంతో కూడుకున్న పనిగా అభివర్ణించే వారు. అలాంటి పరిస్ధితుల నుండి హైదరాబాద్ నగరం ఒక్కసారిగా మారిపోయింది. కరోనా విసిరిని పంజా వల్ల ఛిన్నాభిన్నమైన జీవితాలు మళ్లీ గాడిలో పడతాయో పడవోననే నమ్మకం లేక, నగరంలో బ్రతుకుబండిని లాగలేక సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు నగర ప్రజలు. దీంతో నగరంలో ఏ కాలనీ చూడు టు-లెట్ బోర్టులే దర్శనమిస్తున్నాయి.

    పట్టణాల్లో కిరాయి ఇళ్లకు తగ్గిపోయిన డిమాండ్‌.. ఎక్కడ చూసినా టు-లెట్‌ బోర్డులే.

    పట్టణాల్లో కిరాయి ఇళ్లకు తగ్గిపోయిన డిమాండ్‌.. ఎక్కడ చూసినా టు-లెట్‌ బోర్డులే.

    హైదరాబాద్ నగరం స్తబ్దుగా మారుతుంది. చిన్న టీ స్టాల్ దగ్గర నుండి పెద్ద మాల్ వరకూ కిటకిటలాడే జనాలు కరోనా వైరస్ ఆంక్షల వల్ల పలచబడిపోయారు. అసలు రోడ్ల మీదకు రావాలంటేనే ఒకరకంగా నగర ప్రజలు వణికి పోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎక్కడ చూడు గతంలో ఉన్నట్టు జనసంచారం కనిపించడంలేదు. ఇక కరోనా వైరస్ తో దేశం మొత్తం లాక్‌డౌన్ ఆంక్షలు అమలైన నేపథ్యంలో అనేక రంగాలు ఆర్దికంగా చితికిపోయాయి. చాలా వరకు ప్రయివేటు కంపెనీలు, ఇతర రంగాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ఆయా రంగాల్లో ఉద్యోగం చేస్తూ బ్రతుకు బండిని నెట్టుకొస్తున్న వేల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

    నగరంలో బ్రతకలేని పరిస్థితులు.. ఖాళీ అవుతున్న కాలనీలు..

    నగరంలో బ్రతకలేని పరిస్థితులు.. ఖాళీ అవుతున్న కాలనీలు..

    ఉద్యోగం కోల్పోయిన వారందరికీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం లేకపోవడంతో సిటీని విడిచి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. పాఠశాలలు తెరుచుకోకపోవడంతో పిల్లలను తీసుకుని ఊళ్లకు ప్రయాణమవుతున్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా ఇల్లు అద్దెకు ఉవ్వబడును అనే బోర్డులే దర్శనమిస్తున్నాయి.గతంలో టు లెట్‌ బోర్డు పెట్టిన ఒకట్రెండు రోజుల్లోనే ఎవరో ఒకరు కిరాయికి దిగేవారు. ఇప్పుడు బోర్డు పెట్టి వారాలు గడుస్తున్నా ఎవ్వరూ వచ్చి ఇల్లు కావాలని అడిగిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఒకప్పుడు కిరాయిదారుల్లో అద్దె చెల్లింపులో నెలకొన్న ఆందోళన, ఇప్పుడు అద్దెకు ఎవరూ రావట్లేదని యజమానుల్లో ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది.

    గత పదేళ్లుగా నగరంలో నివాసం.. ఒక్క సారిగా కాటేసిన కరోనా..

    గత పదేళ్లుగా నగరంలో నివాసం.. ఒక్క సారిగా కాటేసిన కరోనా..

    గత పదేళ్లుగా నగరంలో నివసించడం ఓ ప్రతిష్టాత్మకమైన స్టేటస్ అనే ధోరణి బాగా పెరిగిపోయింది. దీంతో ఏపీ, బిహార్‌, యూపీ, మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాల హైదరాబాద్‌కు వచ్చి చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునేవారు బాగా పెరిగిపోయారు. వారంతా ఇప్పుడు అగమ్యగోచరంలో పడ్డారు. ఏప్రిల్‌, మే నెలల్లో కరోనా కేసులు బాగా పెరగడంతో ఎక్కువమంది ఇళ్లను ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. పట్టణ ప్రాంతాల్లో ఉంటూ పనులు చేసుకునే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారిలో ఎక్కువ మంది కరోనా వైరస్‌ భయంతో ఇళ్లు ఖాళీ చేసి ముల్లేమూటా సర్దుకొని సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో పట్టణాల్లో అద్దె ఇళ్లు ఖాళీ అయిపోయాయి. కరోనాతో ఉద్యోగాలు కోల్పోయి, లాక్‌డౌన్‌తో ఉపాధి కరువైన వారిలోనూ చాలామంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా టు-లెట్ బోర్టులే దర్శనమిస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+