అచ్చిరాని దేవాదాయ శాఖ, రాజకీయ భవిష్యత్ క్లోజ్ - సెంటిమెంట్ రిపీట్..లిస్టులో..!!

దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎన్నికల్లో ఓడిపోతారని.. వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ప్రచారం ఏపీ రాజకీయాలను సెంటిమెంట్ వెంటాడతుంది. ముహూర్తాల నుంచి శాఖల వరకు అనేక అంశాల్లో సెంటిమెంట్ ముడి పడి ఉంది. ఉమ్మడి ఏపీ నుంచి.. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. ఇదే జాబితాలో ఇప్పుడు కొండా సురేఖ విషయంలోనూ చోటు చేసుకుంది.

ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ మంత్రులుగా పని చేసిన ఒక సెంటిమెంట్ వెంటాడుతోంది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ నిర్వహించిన మంత్రి ఆ తరువాత మళ్లీ గెలవరనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ సెంటిమెంట్ దాదాపుగా ప్రతీ దేవాదాయ శాఖ మంత్రి విషయంలోనూ నిజమైంది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో దేవాదాయ శాఖ మంత్రులుగా పని చేసిన ఎం. సత్యనారాయణ రావు, జె. రత్నాకర్ రావు, గాదె వెంకటరెడ్డి పని చేసారు.

Endowments Portfolio Emerges as a Political Jinx Dealing a Blow to Leaders Fortunes in Telugu States

ఆ తరువాత వారు ఎన్నికలకు దూరం అయ్యారు. ఇక.. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్ లో జుపల్లి కృష్ణారావు పని చేసారు. తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేసారు. తరువాత సి. రామచంద్రయ్య దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ తరువాత రాష్ట్ర విభజన తో ఆయన పార్టీ మారాల్సి వచ్చింది.

ఇక, రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన పైడికొండల మాణిక్యాల రావు దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసారు. నాడు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన మంత్రి పదవి కోల్పోయారు.ఇక, జగన్ ప్రభుత్వంలో తొలి విడత దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు పని చేసారు. ఆ తరువాత మంత్రి పదవి కోల్పోయారు. తాజా ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మంత్రివర్గ విస్తరణలో భాగంగా తాడేపల్లిగూడెంకు చెందిన కొట్టు సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొట్టు సత్యనారాయణ పర్యవేక్షించారు. 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్ది బొలిశెట్టి శ్రీనివాస్ చేతిలో ఓటమికి గురయ్యారు. తెలంగాణలో కేసీఆర్ హయాంలో దేవాదాయ పర్యవేక్షించిన ఇంద్రకిరణ్ రెడ్డి సైతం రాజకీయంగా దూరంగా ఉంటు న్నారు. ఇక, ఇప్పుడు రేవంత్ కేబినెట్ లో కొండా సురేఖ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. దీంతో.. దేవాదాయ శాఖ రాజకీయంగా కలిసి రాదనే సెంటిమెంట్ మరోసారి ఇప్పుడు సురేఖ ఎపిసోడ్ తో చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+