ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు..!!

ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 20న విచారణకు రావాలని సూచించింది.

ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో విడత విచారణ కోసం ఈ రోజు ఈడీ ముందు కవిత హాజరు కావాల్సి ఉంది. కానీ, హాజరు కాలేదు. తన ప్రతినిధులను ఈడీ వద్దకు పంపారు. ఒక లేఖ రాసారు. అందులో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుందని..ఆ కేసు తేలే వరకూ విచారణ వాయిదా వేయాలని లేఖలో కోరారు. చట్ట సభ ప్రతినిధిగా చట్టాలు చేసే తనకు చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి తన ముందు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటానని స్పష్టం చేసారు. దీనిని పరిశీలించిన తరువాత ఈడీ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఈడీకి కవిత లేఖ.. మరోసారి నోటీసులు

ఈడీకి కవిత లేఖ.. మరోసారి నోటీసులు


ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీకి రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ రోజు విచారణకు హాజరవుతానని చెప్పిన కవిత న్యాయ నిపుణులతో సుదీర్ఘ మంతనాలు చేసారు. ఆ తరువాత తన ప్రతినిధులతో ఈడీకి లేఖ పంపారు. లేఖతో పాటుగా ఈడీ అధికారులు కోరిన బ్యాంకు స్టేట్ మెంట్లు ఇతర వివరాలను జత చేసారు. అదే లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని కోరారు. మహిళను ఈడి ఆఫీస్ కి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగ్ లో ఉందనే విషయాన్ని తన లేఖలో స్పష్టం చేసారు. ఇప్పటికే కవిత ఇవే అంశాల పైన సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ నెల 24న సుప్రీంలో ఈ పిటీషన్ విచారణకు రానుంది.

ఈ నెల 20న విచారణకు హాజరవ్వాలంటూ

ఈ నెల 20న విచారణకు హాజరవ్వాలంటూ


ఈ లేఖను పరిశీలించిన ఈడీ మరోసారి కవితకు సమన్లు ఇచ్చింది. ఈ నెల 20న విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే సమయంలో అటు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రామచద్ర పిళ్లై కస్టడీ పొడిగింపు పైన ఈడీ కోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో కవితతో పాటుగా పిళ్లైను విచారించాల్సి ఉందనే విషయాన్ని ఈడీ ప్రస్తావించింది. కవిత విచారణకు హాజరు కాలేదని పేర్కొంది. మరో అయిదు రోజుల పాటు పిళ్లై కస్టడీ పొడిగించాలని ఈడీ కోరగా...మూడు రోజులు పొడిగించేందుకు కోర్టు అనుమతించింది. ఇటు కవిత సుప్రీంకోర్టు గతంలో మహిళల విచారణకు సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాల అమలు గురించి ప్రశ్నిస్తున్నారు. తొలి సారి విచారణకు హాజరైన సమయంలో రాత్రి 8 గంటల వరకు విచారణ కొనసాగించిన అంశాన్ని కవిత తరపు ప్రతినిధులు ప్రశ్నించారు

కవిత నిర్ణయంపై ఉత్కంఠ

కవిత నిర్ణయంపై ఉత్కంఠ

తాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని కవిత తరపున ఈడీని కలిసిన సోమా భారత్ వెల్లడించారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కవిత చేసిన వాదనకు భిన్నంగా ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కోర్టులో ఈ నెల 24న విచారణ ఉండగా.. 20న విచారణకు రావాలని సూచించింది. దీని ద్వారా కోర్టులో పిటీషన్ అంశం తో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని ఈడీ భావిస్తున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఇప్పుడు కవిత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. కవిత పార్టీ నేతలతో పాటుగా న్యాయ నిపుణులతో ఇదే అంశం పైన వరుస చర్చలు చేస్తున్నారు. తాజా సమన్ల పైన కవిత నిర్ణయం ఇప్పుడు కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+