కరోనాలోనూ ఉద్యోగులకు జీతాల పెంపు -30శాతం పెరుగుదల సిఫార్సు చేసిన పీఆర్సీకి కేబినెట్ ఆమోదం
కరోనా దెబ్బకు అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణలోనూ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడినా ఉద్యోగుల సంక్షేమంలో మాత్రం వెనక్కితగ్గబోమని కేసీఆర్ సర్కారు పేర్కొంది. రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీకి సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన మంత్రి వర్గసమాశేవం కొత్త పీఆర్సీకి ఆమోదం తెలిపింది.
Recommended Video
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ (9,21,037 మందికి) 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు రాష్ట్ర కేబినెట్ ఇప్పుడు ఆమోదం తెలిపింది.

పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ ను 1.4.2020 నుంచి, క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
పెన్షనర్లకు 1.4.2020 నుంచి 31.5.2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించగా, కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఇక, హెచ్ ఆర్ ఏ మీద పరిమితిని తొలగించాలనీ కేబినెట్ నిర్ణయించింది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కు తెలంగాణ కేబినెట్ మరిన్ని సడలింపులు ఇచ్చింది. మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడగిస్తూ, సడలిపు సమయాన్ని 12 గంటలకు పెంచింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చింది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కఠిన లాక్ డౌన్ అమలులో ఉంటుంది.












Click it and Unblock the Notifications