మా ఎమ్మెల్యేలను కొట్టారు: టిఆర్ఎస్‌పై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ద్రోహులు, గూండాలు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేర్చుకుని శాసనసభలో తమను కొట్టించారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. అది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే వ్యవహారమని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నుంచి వెళ్లిపోయి టిఆర్‌ఎస్‌లో చేరిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మాదిగలకు, మాలలకు, మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కోసం 1200 మంది బలి అయితే, 400 మంది అని మాత్రమే ప్రభుత్వం చెబుతోందని, వారి కుటుంబాలను ఇప్పటి వరకు కూడా ఆదుకోలేదని ఆయన అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని ఆయన అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. టిఆర్ఎస్ చర్యలను జర్నలిస్టులు కూడా ఖండించాలని ఆయన సూచించారు.
తమ పార్టీ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ టిఆర్ఎస్‌లోకి రాకపోవడం వల్లనే ఆయనపై దాడి చేయించారని ఎర్రబెల్లి ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారని, తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులను కొట్టించారని ఆయన ఆరోపించారు. ఈ రోజు తమపై దాడి చేశారని ఆయన అన్నారు. తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని అన్నారు.

టిఆర్ఎస్ చర్యలను తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్, కళాకారులు నిలదీయాలని ఆయన అన్నారు. తమను కొట్టినవారిపై, పార్టీ ఫిరాయించినవారిపై చర్యలు తీసుకునేవరకు అసెంబ్లీకి రాకుండా వారు అడ్డుకోవాలని ఆయన అన్నారు. ఎదురు తిరిగినవాళ్లను తన్నాలనే ఆలోచనలో టిఆర్ఎస్ ఉందని ఆయన విమర్శించారు. ఈ సంఘటనలపై తాము బిజెపి, కాంగ్రెసు ఎమ్మెల్యేలను కలుపుకుని పోతామని ఆయన చెప్పారు.
ఈ రోజు ప్రజాస్వామ్యానికి దుర్దినమని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచారని ఆయన అన్నారు. మందబలంతో, మదబలంతో సభ్యులపై టిఆర్ఎస్ వారు దాడి చేయడమే లక్ష్యంగా ఎంచుకున్నారని ఆయన ఆరోపించారు. తలసానిపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. దున్నపోతుల్లా, ఆంబోతుల్లా పెంచి పోషిస్తూ తమపై దాడులు చేయిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు.
నిరసన తెలుపుతున్న తమపై మార్షల్స్‌ను వాడడం దుర్మార్గమని ఆయన అన్నారు. తమను అడ్డుకున్న మార్షల్స్‌ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వీడియో దృశ్యాలను బయటపెట్టాలని ఆయన స్పీకర్‌ను కోరారు. అన్ని కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకే జరిగాయని, తమపై దాడి జరుగుతుంటే చిద్విలాసంగా చూస్తూ కెసిఆర్ కూర్చున్నారని, ముఖ్యమంత్రిపైన కూడా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
స్పీకర్‌కు టిడిపి ఎమ్మెల్యేల వినతి
టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని, ధర్మారెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డికి అసెంబ్లీలో టీడీపీ స్థానంలోనే సీట్లు కేటాయించాలంటూ తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి టీడీపీ ఎమ్మెల్యేలు శనివారం లేఖ రాశారు. తలసానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు సిఫారసు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ముగ్గురి అనర్హతకు సబంధించి పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలో కోరారు.
-
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications