కేసీఆర్‌పై నిప్పులు కక్కిన ఎర్రబెల్లి, మోసగాడి ముద్ర వద్దని కేసీఆర్‌కు రాఘవులు
హైదరాబాద్: లెక్కకు మించి అప్పులు తీసుకొచ్చి, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దొచుకుతింటుందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు దుమ్మెత్తి పోశారు. వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో జరిగిన ఆశా వర్కర్ల బహిరంగ సభకు గురువారం ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బోర్డులో కనపడుతున్నాయి తప్ప, ఆచరణ సాధ్యం కావడం లేదన్నారు.
ఆశా వర్కర్ల పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఆశా వర్కర్ల సమస్యలు తీర్చేంత వరకు అసెంబ్లీ జరగనివ్వమని ఈ సందర్భంగా ఎర్రబెల్లి చెప్పారు.

ఆశా వర్కర్ల కనీస వేతన డిమాండ్ సమంజమే: రాఘవులు
ఆశా వర్కర్ల కనీస వేతన డిమాండ్ సమంజమైనదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. గురువారం మహబూబ్ నగర్‌లో జరిగిన ఆశావర్కర్ల ఆందోళన కార్యక్రమానికి ఆయన తన మద్దతు తెలిపారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎంగా ఉన్న కేసీఆర్ మోసగాడిలా ముద్రవేసుకొవద్దని ఆయన హితవు పలికారు. ఆశా వర్కర్ల సమస్యసలు పరిష్కరించకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలను మరింతగా ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications