ప్రజా సమస్యలను టీఆర్ఎస్ గాలికి వదిలేసింది: పాదయాత్రలో ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. గూదూర్ నుంచి కొత్తలాబాద్ వరకు యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా పాలకుర్తి మండలంలో అన్ని చెరువులు నింపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. ఎర్రబెల్లి చేపట్టిన ఈ పాదయాత్ర సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.

రైతుల కోసం ఆమరణ దీక్ష: వంటేరు
రైతుల అత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలోని కరువు మండలాల జాబితాను కేంద్రానికి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. అవసరమైతే రైతుల కోసం ఆమరణ దీక్ష చేపడతామని వంటేరు వెల్లడించారు.












Click it and Unblock the Notifications