జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. ఇప్పటికే ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటే ప్రదీప్ రావు కూడా ఆగస్టు 7న ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు.

Errabelli Pradeep Rao and other leaders joins in BJP on the presence of JP Nadda

ఎర్రబెల్లి ప్రదీప్ రావుతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వీటి విజయ్ కుమార్, యోగానంద్ కొల్లూరు కూడా బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, గరికపాటి మోహన్ రావు ఉన్నారు.

ఈ సందర్బంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ బలంగా ఉందని, అధికారంలోకి వచ్చేందుకు మంచి అవకాశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+