చర్మం వలిచి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేను.!మాటను నిలబెట్టుకుంటున్నఈటల.!
హైదరాబాద్ : ప్రజల కష్టాల్లో సుఖాల్లో వారి వెంట ఉండేవాడే నిజమైనా రాజకీయ నాయకుడు. ఈ అంశాన్ని వందకు వంద శాతం నిజం చేసి చూపించారు హుజురాబాద్ బీజేపి ఎమ్మెల్చే ఈటల రాజేందర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని, ప్రతి ఇంట్లో జరిగే శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు హాజరై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారని ఈటల రాజేందర్ గురించి ప్రజలు చర్చించుకుంటారు. ఈరోజు ఆ పేరు సార్థకమైందనే చర్చ జరుగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో 35 వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈటల రాజేందర్. ఒక్క క్షణం కూడా సమయం వృధా చేయకుండా 35 పెళ్లి మండపాలను చుట్టి వచ్చారు ఈటల రాజేందర్.

అంతే కాకుండా హుజురాబాద్ నియోజకవర్గంలో వివాహానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు అందించి వచ్చారు ఈటల. ప్రతి ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ఈటల హాజరు అవుతారు అనడానికి ఇదే నిదర్శని చర్చ జరుగుతోంది. తమ జీవితంలో మధురమైన ఘట్టం అయిన పెళ్లికి తమ అభిమాన నాయకుడు హాజరై ఆశీర్వదించడం పట్ల కొత్త పెళ్లిజంటలు, వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచే వరకు మాత్రమే ప్రజలను పట్టించుకుని, ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయే నాయకులున్న ఈ రోజుల్లో, ఈటల లాంటి నిఖార్సయిన నాయకుడు నిత్యం అందుబాటులో ఉంటున్నారని అందుకే ఆయన మా గుండెల్లో ఉన్నారు అని ఈటల అభిమానులు అంటున్నారు. హుజూరబాద్ ప్రజలకు చర్మం వలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేనిదని గతంలో చెప్పిన ఈటల రాజేందర్, ఈ ప్రజల కోసం ఎంత చేసినా తక్కువే అని అన్నారు.












Click it and Unblock the Notifications