మల్కాజిగిరి చౌరస్తాకు రా..: రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ సవాల్

మల్కాజిగిరి: రానున్న లోక్‌సభ తెలంగాణ ప్రజలంతా బీజేపీకి ఓటేసి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్‌​లో లక్ష మెజార్టీతో బీజేపీ గెలిచిందని మల్కాజిగిరి నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వాదిస్తారని తెలిపారు. మల్కాజిగిరిలో తాను గత 32 ఏళ్లుగా నివాసం ఉంటున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్​ అన్నారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్​ రెడ్డి నియోజకవర్గానికి, ప్రజలకు ఏం చేశారో తెలుసుకోవడానికి మల్కాజిగిరి చౌరస్తా వద్ద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఈటల సవాల్​ విసిరారు.

Etala Rajender fires cm revanth reddy in malkajgiri bjp meeting

మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎక్కువగా సీఎం రేవంత్​ తిరిగారా లేక తాను తిరిగానా? అనేది తేల్చుకుందామా? అంటూ ఈటల ప్రశ్నించారు. దేశంలో మళ్లీ ప్రధాని అయ్యేది మోడీనే అని సర్వేలు, ఇంటెలిజెన్స్​ రిపోర్టులు, తాము ప్రజల మధ్య తిరిగినప్పుడు చెబుతున్నారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలకు అభ్యర్థులే కరవు అయ్యారని అన్నారు.

కచ్చితంగా ఈ లోక్‌​సభ ఎన్నికలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. చదువుకున్న వాళ్లను అడిగితే ఈ దఫా మోడీనే ప్రధాని అవుతారు అంటున్నారు. బస్తీలల్లో అడిగితే సామాన్య ప్రజలు అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడి ఎన్నికలు, వచ్చేవి మోడీ ఎన్నికలు కదా తప్పకుండా గెలుస్తారు అంటున్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కార్యకర్తలు కూడా ఈసారి కూడా బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయని, మోడీనే ప్రధాని అవుతారని అంటున్నారని ఈటల రాజేందర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+