తొందరపడొద్దు: మాజీ మంత్రి చంద్రశేఖర్‌తో ఈటల రాజేందర్ భేటీ
హైదరాబాద్: పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్‌తో ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. చంద్రశేఖర్ నివాసానికి వెళ్లిన ఈటల ఆయనతో చర్చలు జరిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఈ క్రమంలో బీజేపీలో ఎదురైన ఇబ్బందులను ఈటలకు చంద్రశేఖర్ వివరించారు.
పార్టీలో చేరి రెండున్నరేళ్లు అయినా ఎలాంటి పదవి ఇవ్వలేదని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని.. వారికి ఉమ్మడిగా ఎజెండా ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. ఏ, బీ, సీ, డీ వర్గీకరణకు బీజేపీ కమిట్మెంట్‌తో ఉందన్నారు. కర్ణాటకలో హామీ ఇచ్చామని.. తెలంగాణలో కూడా వర్గీకరణకు కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడం కోసం కలిసి పనిచేస్తామని ఈటల అన్నారు.

తాను పార్టీ వీడతానని మీడియా విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వరంగల్ ప్రాంతం వరకే మోడీ మీటింగ్ జరిగిందని స్పష్టం చేశారు. అందుకే చంద్రశేఖర్‌కి మోడీని కలిసేందుకు పాస్ రాలేదని తెలిపారు. అంతే తప్ప మరొక అంశం ఇందులో ఇమిడి లేదన్నారు. పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలనే ఈ భేటీలో చర్చించామని.. చంద్రశేఖర్ తెలిపారు.
తాను పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఈటలకు చెప్పానన్నారు. పార్టీలో జరుగుతన్న విషయాలపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఎమ్మెల్యే, మంత్రుల పదవికి రాజీనామా చేశామన్నారు. అంత కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్రం బాగుండాలనుకునే వ్యక్తుల్లో ఈటల, తాను మొదటి వరుసలో ఉంటామన్నారు. తెలంగాణ అభివృద్ధి చేయాలనే అంశాలపైనే ఎక్కువగా చర్చించామన్నారు చంద్రశేఖర్.
బీజేపీలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగిపోగా.. కిషన్ రెడ్డి ఆ బాధ్యతలను చేపట్టారు. మరోవైపు, ఈటల రాజేందర్‌ను తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ అధిష్టానం నియమించింది. కాగా, ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహిస్తున్న క్రమంలో బీజేపీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications