Eetala Rajender: రండి, బాధ్యతగా ఓటు వేయండి.. ఈటల పిలుపు..
ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు వేయాలని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన పూడూర్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర ఘట్టంగా అభివర్ణించారు. ఎన్నికల్లో నోట్లు, మద్యంతో ప్రలోభపెట్టడం మంచి కాదన్నారు. ఈటల రాజేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేశారు. అయితే రెండు స్థానాల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు.
హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించగా.. గజ్వేల్ లో కేసీఆర్ గెలుపొందారు. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈటల స్ఠానికంగా కరీంనగర్ నియోజకవర్గానికి చెందినవారు. అయితే అక్కడ బండి సంజయ్ ఉండడంతో ఈటల రాజేందరు మల్కాజిగిరికి రావాల్సి వచ్చింది. ప్రచారంలో ఈటల కష్టపడ్డారు. ఆయన ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది.













Click it and Unblock the Notifications