బండారం బయటపెడతాననే సస్పెండ్ చేశారు: కేసీఆర్, హరీశ్‌పై ఈటల రాజేందర్ విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ నుంచి తనతోపాటు ముగ్గురు బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండారం బయటపెడతాననే సస్పెండ్ చేశారు: ఈటల రాజేందర్
గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం మంచిది కాదని చెప్పామని తెలిపారు. 20ఏళ్ల అనుభవం ఉన్న శాసనసభ్యుడిగా స్పీకర్‌కు పదే పదే గుర్తు చేసినట్లు తెలిపారు. తమ సీట్లో ఉండి నిరసన తెలిపితే సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఈ దుర్మార్గమైన పద్ధతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకూడదని వ్యాఖ్యానించారు. బడ్జెట్ పై తాను మాట్లాడితే బండారం బయట పడుతుందనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. తనకు చట్టం మీద స్పష్టమైన అవగాహన ఉందన్నారు ఈటల.

మంత్రి హరీశ్ రావుపై ఈటల రాజేందర్ ఫైర్
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రజలు కట్టే పన్నుల మీద ప్రభుత్వాలు నడుస్తాయి తప్పితే.. కేంద్ర ప్రభుత్వం నిధులతో కాదనే విషయాన్ని హరీశ్ రావు గుర్తుంచుకోవాలన్నారు. బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవని, ఉమ్మడి రాష్ట్రంలోనూ 20 రోజులకుపైగా సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. అయితే, నేటి తెలంగాణ ప్రభుత్వం కేవలం 7 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఇది గమనించాల్సిన విషయన్నారు ఈ టల రాజేందర్.

కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడిన ఈటల రాజేందర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక అంకెల గారడీ అని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 37వేల కోట్లు అని చెప్పారు. గ్రామాల్లో బెల్టు షాపులను పెట్టించి యువకులను మద్యానికి బానిస చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్రంలో యువశక్తి గంజాయి, లిక్కర్‌కి బానిస అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చకు సిద్ధమన్నారు కిరాయి భవనాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి తప్పితే.. సొంత భవనాలు లేవని అన్నారు. పాఠశాలలు బంజరు దొడ్డిలా ఉంటే నాణ్యమైన విద్య అందుతుందా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
ఈటల. అసెంబ్లీ నుంచి తమ సస్పెన్షన్ పై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కాగా, ఇప్పటికే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై ఈటలతోపాటు బీజేపీ సభ్యులు రఘునందన్ రావు, రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications