హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిర్యాదులు-తనిఖీలు: ఆనంద్‌నగర్‌లో గవర్నర్, గోదాంలలో మంత్రి ఈటెల(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సన్న బియ్యంపై ప్రతిపక్ష పార్టీలు మతిలేని ఆరోపణలు చేస్తున్నాయని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని అన్నారు. 57 ఏళ్లుగా సాగుతున్న అక్రమాలపై ఉక్కుపాదం మోపి చాలావరకు నియంత్రించగలిగామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యంతోనే భోజనం పెడ్తున్నామని, ఈ విషయాన్ని విద్యార్థులను అడిగితే చెబుతారని అన్నారు.

బుధవారం హైదరాబాద్‌లోని పలు ఆహార సరఫరా గోదాములను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ఆజామాబాద్, ముషీరాబాద్‌లలోని పౌర సరఫరాల శాఖకు చెందిన గోదాములను ఆకస్మికంగా తనఖీ చేశారు. సరుకుల సరఫరా గురించి వివరాలు తెలుసుకున్నారు. గోదాముల పరిస్థితిని చూసి ఎలాంటి సమస్యలు ఉన్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుపై పేదలకు పంపిణీ అవుతున్న 4 కిలోల బియ్యాన్ని నుంచి 6 కిలోలకు పెంచామని, నేడు కంది పప్పు బహిరంగ మార్కెట్‌లో రూ. 150 ఉంటే రూ.50కే అందిస్తున్నామని, చక్కెర కూడా కేవలం రూ.13.5కే అందిస్తున్నామని చెప్పారు. ప్రజా పంపిణీలో అన్యాయాలను అరికట్టడానికి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఈటల కోరారు.

అవినీతిని అరికట్టడంలో భాగస్వాములు కావాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రేషన్ దుకాణాల్లో అందించే సరుకుల్లో నాణ్యత లేకున్నా, ప్యాకెట్లు చినిగి ఉన్నా, ప్రభుత్వం అందించే సరుకులు దుకాణంలో లేవని చెప్పినా డీలరును ప్రశ్నించాలని చెప్పారు. లేదంటే పౌరసరఫరాలశాఖ టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్రతీ రేషన్ దుకాణంలో ధరల పట్టికతోపాటు ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నంబరు రాసి ఉంటుందని తెలిపారు. గ్రామ సర్పంచ్‌తోపాటు ఇతర సభ్యులతో కూడిన ఫుడ్ అడ్వయిజరీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అహార పదార్థాలు, ధాన్యం, దినుసులు నిల్వ చేసేందుకు త్వరలో అధునాతన గోడౌన్లు నిర్మిస్తామని మంత్రి తెలిపారు.

తాము తీసుకుంటున్న చర్యల వల్ల కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే 54 వేల రేషన్ కార్డులు స్వచ్చందంగా సరెండర్ చేశారని తెలిపారు. స్టేజ్-1 స్థాయిలోనే 72 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసామని, 2,448 మందిపై కేసులు నమోదు చేసామని చెప్పారు. కొంతమంది మిల్లర్లు కూడా స్టేజి 1 కాంట్రాక్టర్లుగా ఉన్నారని చెప్పారు. అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టును రద్దు చేసి..కొత్త కాంట్రాక్టులు పిలుస్తున్నామని చెప్పారు. బియ్యం అక్రమాలకు పాల్పడేదీ అధికారులు, మిల్లర్లు, మరెవరైనా వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.

మంత్రి తనిఖీలు

మంత్రి తనిఖీలు

బుధవారం హైదరాబాద్‌లోని పలు ఆహార సరఫరా గోదాములను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మంత్రి తనిఖీలు

మంత్రి తనిఖీలు

ఉదయం ఆజామాబాద్, ముషీరాబాద్‌లలోని పౌర సరఫరాల శాఖకు చెందిన గోదాములను ఆకస్మికంగా తనఖీ చేశారు. సరుకుల సరఫరా గురించి వివరాలు తెలుసుకున్నారు.

గవర్నర్ పరిశీలన

గవర్నర్ పరిశీలన

పంజాగుట్ట డివిజన్‌లోని ఆనంద్‌నగర్‌లో మురుగు సమస్యను పరిష్కరించేలా చేస్తానని గవర్నర్ నరసింహన్ అన్నారు.

గవర్నర్ పరిశీలన

గవర్నర్ పరిశీలన

‘స్వచ్ఛ హైదరాబాద్'లో ఆనంద్‌నగర్ డివిజన్‌కు మెంటారుగా వ్యవహరించిన ఆయనకు ఆయనకు స్థానికులు మురుగు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించారు.

గవర్నర్ పరిశీలన

గవర్నర్ పరిశీలన

మురుగునీరు, తాగునీటి కలుషిత సమస్య ఉన్న రేణుకా అపార్టుమెంట్ ప్రాంతాన్ని నేరుగా వచ్చి పరిశీలించారు. పిర్యాదుదారు సుబ్బారావును, స్థానికులను అడిగి ఇబ్బందులను తెలుసుకున్నారు.

English summary
Telangana Minister Etela Rajender on Wednesday inspected in Rise godowns in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X