వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలోకి త్వరలో చేరికల ప్రళయం: మిషన్ తెలంగాణా మొదలైందన్న ఈటల రాజేందర్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేస్తున్న బీజేపీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం మిషన్ తెలంగాణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బిజెపి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.

తెలంగాణాలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష

తెలంగాణాలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష


తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బిజెపి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పే పనిలో పడింది. అందుకోసం ఇప్పటి నుండే కష్టపడుతుంది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్న పరిస్థితి ఉంది. ఒకపక్క ప్రజాక్షేత్రంలో విభిన్న కార్యక్రమాలతో ముందుకు సాగుతూనే, బీజేపీ మరోపక్క ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్ధి పార్టీల నుండి బలమైన నాయకులను ఆకర్షించే పనిలో పడింది.

బీజేపీలోకి చేరికల ప్రళయం .. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీలోకి చేరికల ప్రళయం .. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యంగా బిజెపి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని చేస్తోంది. త్వరలో బిజెపిలోకి చేరికల ప్రళయం రాబోతుందని తాజాగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బిజెపి ఏ పార్టీల నుండి కీలక నాయకులను ఆకర్షించే పనిలో పడింది అనే అంశంపై అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. రాష్ట్రంలో పార్టీలలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను ఇప్పటి నుండే సెట్ చేసే పనిలో ఉంది. దీనికోసం బలమైన నాయకులకు పార్టీలోకి ఆకర్ష అంటుంది.

చేరికలను వేగవంతం చెయ్యాలని తరుణ్ చుగ్ సూచన

చేరికలను వేగవంతం చెయ్యాలని తరుణ్ చుగ్ సూచన

తాజాగా బీజేపీ చేరికల కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ చేరికలను వేగవంతం చేయాలని సూచించారు. బలమైన నేతలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉంటే వారికి భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు. 80 నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు ఉన్నారని తెలిపిన ఆయన వారి కంటే బలమైన నేతలు ఎవరైనా వస్తామంటే, పార్టీలో చేర్చుకుందామని సూచించారు. 40 నియోజకవర్గాలలో బలమైన నాయకులు కావాలని, అటువంటి నాయకులను లక్ష్యంగా చేసుకొని వారికి సీటు ఇచ్చే విషయంలో విశ్వాసం కల్పించాలని, కానీ సీటు వారికే అన్నది మాత్రం కన్ఫామ్ చేయలేమని తరుణ్ చుగ్ పేర్కొన్నారు.

 కాంగ్రెస్ నుండి చాలా మంది సీనియర్లు బీజేపీలో చేరే ఆసక్తి

కాంగ్రెస్ నుండి చాలా మంది సీనియర్లు బీజేపీలో చేరే ఆసక్తి


బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ కెసిఆర్ ను గద్దె దించడం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందని, ఇతర పార్టీల్లోని నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం బిజెపిలో చేరాలని భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. త్వరలోనే బిజెపిలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. దేశంలో కాంగ్రెస్ బలహీనపడింది అని పేర్కొన్న ఈటల రాష్ట్రంలోనూ అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిందని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్లు బిజెపి వైపు చూస్తున్నారన్నారు.

 అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీ

అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీ


సీఎం తీరు రుచించని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీలు, వేలాదిమంది సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వంపై మంటతో ఉన్నారని పేర్కొన్న ఈటల రాజేందర్, త్వరలో గ్రామాలలో చేరికల ప్రళయం రాబోతుందని, దీనిపై చర్చలు కూడా జరుపుతున్నామని పేర్కొన్నారు. తాజాగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో త్వరలో బీజేపీ వివిధ పార్టీల నుండి బలమైన నాయకులకు చేర్చుకుంటుందా? ఏ పార్టీ నాయకులకు బీజేపీ షాక్ ఇస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

English summary
Etala Rajender stated that there will soon be a huge influx of BJP in Telangana state, seniors from Congress party and many MLAs from BRS are looking towards BJP. He added that Mission Telangana has started.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X