ఆంధ్రా పార్టీల్నితరమండి: ఈటెల, గులాబీపై కిషన్ ఫైర్

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా నుండి ఆంధ్రా పార్టీలను తరిమేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి పైవ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురువారం ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ కాస్త గులాబీ కాకతీయగా మారిందన్నారు.

చెరువుల వద్దకు తెరాస కార్యకర్తలు తప్ప మిగతా వారిని రానివ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం నిధులతో గడ్డపారలకు గులాబీ రంగు వేయించడం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమో లేక తెరాస కార్యక్రమమో అర్థం కావడం లేదన్నారు.

Etela Rajender says No space for Andhra Parties in Telangana

జగదీశ్వర్ రెడ్డి సవాల్

కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం సవాల్ విసిరారు. ఫీజు రీయింబర్సుమెంట్సులో ఎక్కడా తప్పులు లేవన్నారు. జాతీయ కాంగ్రెస్ కేవలం నల్గొండకే పరిమితం అయిందని, అదీ లేకుండా పోతుందనే తన పైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాకు సిద్ధమైతే ప్రజా కోర్టుకు వెళ్లేందుకు తాను సిద్ధమన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా కోర్టు శిక్షిస్తుందన్నారు.

ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉచిత వైఫై

హైదరాబాద్‌లో ఉచిత వై-ఫై సేవలను బుధవారం పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభిస్తున్నారు. సాగర్ చుట్టూ పైలెట్ ప్రాజెక్టుగా అందిస్తున్న ఈ సేవలను బుధవారం సాయంత్రం హోటల్ మారియట్‌లో లాఛనంగా ప్రారంభిస్తారు.

ఉచిత వై-ఫైతో మంత్రి కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పేస్ టైంకాల్‌లో సంభాషిస్తారు. ఈ వీడియో కాల్‌తోనే నగరంలో ఉచిత వై-ఫై సేవలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్‌తో కలిసి క్వాడ్ జెన్ కంపెనీ ఈ సేవలను నగరంలో ప్రయోగాత్మకంగా అందించబోతున్నది.

సాగర్ పరిసరాల్లోని ట్యాంక్‌బండ్, లుంబినీ పార్కు, నెక్లెస్‌రోడ్డు చుట్టూ 10కిలోమీటర్ల పరిధిలో ఈ ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. 10 కిలోమీటర్ల పరిధిలో మొదటి అరగంట ఉచితంగా వైఫై సేవలు పొందవచ్చు. 2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వేగంతో ఈ సేవలు వినియోగదారులకు అందుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+