పండగలా: బడ్జెట్‌పై ఈటెల సతీమణి జమున ఏమన్నారంటే..?
హైదరాబాద్: గురువారం ఉదయం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్‌పై ఆయన సతీమణి స్పందించారు. ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారని అన్నారు.
Recommended Video

సామాన్య ప్రజలు సంతోషపడే బడ్జెట్ అవుతుందని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.
'15రోజుల నుంచి అహర్నిశలు కష్టపడి బడ్జెట్ రూపొందించారు. మా ఇంట్లో అందరూ పనిచేస్తుండటంతో పండగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ సర్కారు బడుగు బలహీన వర్గాలు, సామాన్యుల కోసం పనిచేస్తోంది' అని జమున తెలిపారు.

అంతేగాక, ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, మహిళలు, సామాన్య ప్రజలకు పెద్ద పీట వేశారని జమున చెప్పారు. కాగా, అణగారిని వర్గాల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ బడ్జెట్ దేశానికి ఆదర్శమని మంత్రి ఈటెల తెలిపారు.
వ్యవసాయం, సంక్షేమం, విద్యా, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం ఇన్స్యూరెన్స్ స్కీం ప్రవేశపెట్టబోతున్నామని మంత్రి ఈటెల చెప్పారు. కాగా, మంత్రి ఈటెల్ వరుసగా ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.












Click it and Unblock the Notifications