ఉగాదికి మరో గుడ్‌న్యూస్ చెప్పిన సర్కారు

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్​ కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే సన్న బియ్యం ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఉగాది రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందన్నారు. హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్​ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.

తెలంగణ రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం ఆందనుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రేషన్‌ బియ్యాన్ని చాలామంది ఉపయోగించుకోవడం లేదని, దొడ్డు బియ్యం తినకుండా కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నారని అన్నారు. సన్నబియ్యం పంపిణీ చేయడం ద్వారా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారని చెప్పారు.

Even for those without ration cards distribution of fine rice on Ugadi Uttam Kumar Reddy


సన్న బియ్యంతో పాటు త్వరలోనే పప్పు, ఉప్పు లాంటి ఇతర సరకులు చౌక ధరల దుకాణాల ద్వారా అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునేలా ఏర్పాటు చేశామని, కొత్త రేషన్‌ కార్డులు ఎంతమందికి కావాలన్నా అర్హతను బట్టి ఇస్తున్నట్లు వివరించారు. రేషన్‌ బియ్యంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటా రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు.

ఇది ఇలావుండగా, ఉగాది తర్వాత ఏఐ ఫ్యూచర్‌ సిటీకి భూమిపూజ చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఫ్యూచర్‌ సిటీకి ప్రణాళికలు రూపొందించామని, 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మించనున్నట్లు తెలిపారు. ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులకు టెక్ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో తెలంగాణ హబ్‌గా మారుతుందని శ్రీధర్‌బాబు అన్నారు. క్వాంటం కంప్యూటింగ్‌లో కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలు ఎదిగితే రాష్ట్రం వృద్ధి చెందుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+