హరీష్ రావు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కూడా నాకే ఓటు వేస్తది.!హుజూరాబాద్ లో ఈటల ధీమా.!

హుజురాబాద్/హైదరాబాద్ : ఉద్యమ సమయం లో ఉద్యమం చేసిన వాళ్ళు చంద్రశేఖర్ రావు వైపే ఉన్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేసారు. హుజూరాబాద్ ఎన్నిక ఒక సీటు కోసం కాదని, ఈటల గెలిస్తే అనేక మంది ఈటల రాజేందర్ లు ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతో హుజూరాబాద్ లో ఇప్పటి వరకు చంద్రశేఖర్ రావు 192 కోట్ల ఖర్చు పెట్టారని ఈటల వివరించారు. హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్ లో కుల సమ్మేళనం సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. హుజూరాబాద్ లో ప్రజలు ఏది కోరుకుంటే అది ఇవ్వాలని చంద్రవేఖర్ రావు అధికారులకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేసారని, ఐదుగురు మంత్రులను, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను పంపించి ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నాడని చంద్రశేఖర్ రావుపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. హుజూరాబాద్ లో బిజెపి నాయకుల పైనే కాకుండా టీఆరెఎస్ ఇంఛార్జి ల పైన కూడా చంద్రశేఖర్ రావు నిఘా ఏర్పాటు చేసాడని ఈటల స్పష్టం చేసారు.

Even the girl in Harish Raos house will vote for me.! Etala

హుజూరాబాద్ నియోజకవర్గం లో గత మూడు రోజుల నుండి దసరా పండుగ నడుస్తుందని, రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పదని నిరూపిస్తున్నారని హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలనుద్దేశించి ఈటల పేర్కొన్నారు. తెలంగాణలో రాజకీయ విలువలు లేవు కేవలం చంద్రశేఖర్ రావు అరాచకం మాత్రమే ఉందని,
తన పద్దెనిమిది సంవత్సరాల రాజకీయ చరిత్ర లో సంస్కార హీనంగా ఎప్పుడూ మాట్లాడలేదని గుర్తు చేసుకున్నారు ఈటల. 2014 లో చంద్రశేఖర్ రావుతో పాటు హరీష్ రావు ఆస్తులు ఏంటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని అన్నారు. 119 నియోజక వర్గాల్లో తానొక్కడే పెత్తనం చెలాయించాలని చంద్రశేఖర్ రావు భావిస్తుంటారని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ లో టీఆరెఎస్ అభ్యర్థి ఎస్ సి నా? బిసి నా ? కాదు కేసీఅర్ కు కావల్సింది ఒక బానిస అని తెలిపారు. దళిత బంధు ఒక్క హుజూరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తం గా ఇవ్వాలని కోరుకుంటున్నట్టు ఈటల తెలిపారు. దుబ్బాక లో బిజెపి వస్తె సంక్షేమ పథకాలు ఆగలేదు కాబట్టి హుజూరాబాద్ లో కూడా అగవని భరోసా ఇచ్చారు ఈటల. హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలకు పార్టీలు ముఖ్యం కాదని, ఈటల రాజేందర్ ముఖ్యమని, తాను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలు గెలిచినట్టేనని ఈటల రాజేందర్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+