వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు అగ్నిపరీక్ష: వెంకయ్య మాటలతో తేటతెల్లం, వర్గీకరణ గతేనా...

కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటర్జీ: ముస్లింల కోసం రిజర్వేషన్ల విస్తరణకు సాధ్యమేనా? రాజ్యాంగ సవరణకు కేంద్రం అంగీకరిస్తుందా?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లశాతం పెంచుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అంతటితో ఆగకుండా తమిళనాడులో అమలుచేస్తున్న చట్టాన్ని మక్కీకి మక్కీగా చట్టాన్ని రూపొందిస్తామని కూడా చెప్పారు.

కొన్ని విధాన నిర్ణయాలు, చట్టాల రూపకల్పనలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆమోదం ఉంటే తప్ప రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉండవు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మిత్రపక్షం కాకున్నా.. అన్ని అంశాల్లో ఎన్డీయే సర్కార్‌కు బాసటగా నిలుస్తోంది.

అయినా రిజర్వేషన్లు.. ప్రత్యేకించి మైనారిటీలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పించడానికి బీజేపీ వ్యతిరేకం. దీన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు కమలనాథులు ముందస్తు వ్యూహం రూపొందిస్తున్నారు. ఒకవేళ వ్యతిరేకిస్తే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), సీఎం కేసీఆర్ వ్యూహం రూపొందిస్తున్నారు.

ముస్లిం రిజరేషన్లపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రకటన, బిజెపి నాయకుల ప్రకటనలు ముస్లిం రిజర్వేషన్ల భవిష్యత్తును తేటతెల్లం చేస్తున్నాయి. రిజర్వేషన్ల కోటాను 50 శాతానికి మించి ఇస్తూ రాజ్యాంగంలో పొందుపరచడానికి కేంద్రం సిద్ధంగా లేదనే విషయం ఆ ప్రకటనలు తెలియజేస్తున్నాయి.

 జాట్లు, పటేళ్ల ఆందోళన ఉద్రిక్తం

జాట్లు, పటేళ్ల ఆందోళన ఉద్రిక్తం

1990 నుంచి రిజర్వేషన్ల విషయమై దేశమంతా రగడ జరుగుతూనే ఉన్నది. వివిధ సందర్భాల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం ‘సుప్రీంకోర్టు' రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని పదేపదే దిశా నిర్దేశం చేసింది. ఇటీవలి కాలంలో హర్యానాలో జాట్లు, గుజరాత్‌లో పాటిదార్లు తమకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చేపట్టిన ఉద్యమం హింసాత్మకమైంది. కానీ ఆచరణలో దానికి వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆయా ఆందోళనలను అణచివేసేందుకు పూనుకున్నది. అంతకుముందు హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని చండీగఢ్ హైకోర్టు కొట్టేసింది.

ఇలా తెలంగాణ ప్రభుత్వ వ్యూహం

ఇలా తెలంగాణ ప్రభుత్వ వ్యూహం

అట్టహాసంగా ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ‘తెలంగాణ ప్రత్యేక రిజర్వేషన్ బిల్లు'ను ఆమోదించేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్దం చేశారు. అంతా అనుకున్నట్లు జరుగడమే కాదు బిల్లును ఏకగ్రీవంగా అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించి పంపడం ఖాయమే మరి. దానికి గవర్నర్ ఆమోదం తెలియజేయడంతోపాటు రాష్ట్రపతి, కేంద్రం ధ్రువీకరణ కోసం పంపుతారు. కేంద్ర హోంశాఖ, రాష్ట్రపతి ఆమోదిస్తేనే దానికి చట్టబద్దత ఏర్పడుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్ల కల్పనకు చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు కొట్టేసింది.

ప్రతి పదేళ్లకు చట్ట సవరణ చేస్తున్న ప్రభుత్వాలు

ప్రతి పదేళ్లకు చట్ట సవరణ చేస్తున్న ప్రభుత్వాలు

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ వసతులు పదేళ్ల వరకే అమలు చేయాలని నాడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఆ రిజర్వేషన్లను తొలుత పాలక పార్టీగా కాంగ్రెస్.. తర్వాత బీజేపీ, ఇతర పార్టీలు ప్రతి పదేళ్లకూ పొడిగిస్తూ వచ్చాయి. కానీ నేటికి ఆయా సామాజిక వర్గాల జీవితాలు అభ్యున్నతి సాధించిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవ పరిస్థితి ఇదైతే తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల కల్పన అంశం రాష్ట్రాలకు వదిలేయాలని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని ఇటీవలి కాలంలో పదేపదే వాదిస్తూ వస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సభాముఖంగానే ఈ వాదాన్ని ప్రకటించారు.

ఇలా రిజర్వేషన్ల విస్తరణపై

ఇలా రిజర్వేషన్ల విస్తరణపై

అయితే కేవలం ముస్లిం మైనారిటీలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తే విమర్శలు వస్తాయన్న సందేహంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల శాతమూ పెంచుతున్నామని అయినా మొత్తం రిజర్వేషన్లను 60 శాతం దాటనివ్వబోమని పేర్కొన్నారు. ఒకవేళ న్యాయస్థానం తిరస్కరించినా, కేంద్రం వ్యతిరేకించినా తన ప్రయత్నాలను అడ్డుకుంటున్నారన్న ప్రచారంతో బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీల మద్దతు కూడగట్టవచ్చునన్నది సీఎం కేసీఆర్, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహంగా ఉన్నది.

కేసీఆర్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలా?

కేసీఆర్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలా?

ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల శాతం పెంచడంతోపాటు ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లను కల్పించడం వరకూ బాగానే ఉన్నది. మిగతా అగ్రవర్ణాలుగా భావిస్తున్న సామాజిక వర్గాల్లో పేదరికంతో బాధపడుతున్న వారి కుటుంబాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ అధికార పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రిజర్వేషన్లు పెంచడం వల్ల సమాజంలో అంతరాలు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు దశాబ్దాలుగా ఉద్యమం ఇలా

రెండు దశాబ్దాలుగా ఉద్యమం ఇలా

దీనికి తోడు 1994 నుంచి ఎస్సీలకు రిజర్వేషన్ల అమలులో సమస్యలపై మందక్రుష్ణ మాదిగ సారథ్యంలో ఏర్పాటైన మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి (ఎమ్మార్పీఎస్).. వర్గీకరణ కోసం నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. నాటి నుంచి కొనసాగుతూ వచ్చిన ఉద్యమం 2014 ఎన్నికల్లోనూ ప్రభావం చూపింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలమని ప్రకటించాయి. ఇటు తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించగా, ఏపీ ప్రభుత్వం పట్టించుకోనే లేదు.

ఇలా కేంద్ర ఆమోదంపై కేసీఆర్

ఇలా కేంద్ర ఆమోదంపై కేసీఆర్

అయినప్పటికీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ కోసం ఉద్యమం సాగుతూనే ఉన్నది. ఇటీవల ఢిల్లీలో జంతర్‌మంతర్ వేదికగా భారీగా జరిగిన ఆందోళనకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను పెంచుతూ తాము చేసే చట్టాన్ని ఆమోదించేలా కేంద్రంతో చర్చిస్తానని, ఒప్పిస్తామని సీఎం కేసీఆర్ ఘంటాపథంగా చెప్తూ వస్తున్నారు.

తెలంగాణలో రిజర్వేషన్ల విస్త్రుతిపై కేంద్రమంత్రి వెంకయ్య ఇలా

తెలంగాణలో రిజర్వేషన్ల విస్త్రుతిపై కేంద్రమంత్రి వెంకయ్య ఇలా

బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేలా ఉన్నాయి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం వ్యతిరేకమని, కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తే మరో పాకిస్థాన్ ఆవిర్భావానికి దారి తీస్తుందని వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో బీజేపీ ఒక విధానం అనుసరిస్తూ ఉండవచ్చు గానీ.. మరో పాక్ ఏర్పాటవుతుందని అసంబద్ధ వ్యాఖ్య చేశారు. అలా పాకిస్థాన్ ఏర్పాటు కావడానికి తెలంగాణ సరిహద్దుల్లో లేదు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ముస్లింల ప్రాతినిధ్యం చాలా తక్కువ. కానీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్య రాజకీయ వ్యూహంతో కూడుకున్నదేనని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కేంద్రంలో అందరి మద్దతు పొందాలి

కేంద్రంలో అందరి మద్దతు పొందాలి

ఎమ్మార్సీఎస్ కోరుతున్న మేరకు రిజర్వేషన్ల వర్గీకరణ జరుగాలంటే జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కావాలి. దానివల్ల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని భావిస్తే తప్ప వర్గీకరణకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అందుకు ముందుకు వచ్చే అవకాశాలు సందేహస్పదమేనని విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో ఉషా మెహ్రా కమిషన్ నివేదిక, దేశవ్యాప్తంగా ఎస్సీలు, వారి మద్దతు గల రాజకీయ నాయకులు, పార్టీల మద్దతు కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనికి తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిస్థాయి మెజారిటీ కలిగి ఉన్నది. కీలక ఆర్థిక సంస్కరణల చట్టాలు రూపొందించడానికే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టేందుకు ఆపసోపాలు పడుతున్నది. కానీ రాజాంగ్య సవరణ చేయాలంటే పార్లమెంట్ ఉభయ సభలో మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం తప్పనిసరి.

రిజర్వేషన్ల విస్తరణ పరిస్థితి ఇదీ..

రిజర్వేషన్ల విస్తరణ పరిస్థితి ఇదీ..

రాజ్యాంగ సవరణ బిల్లును దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదిస్తే తప్ప అది శాసనరూపం సంతరించుకునే అవకాశాలు స్వల్పమే. ఇదిలా ఉంటే హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకం కోసం ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం స్థానే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఎసీ) బిల్లును ఆమోదిస్తే.. దాని రాజ్యాంగ చట్టబద్ధతపై సవాలైన పలు పిటిషన్లను రాజ్యాంగ విస్త్రుత ధర్మాసనం విచారించడంతోపాటు కేంద్రం రూపొందించిన చట్టాన్ని కొట్టి పారేసింది. కనుక అత్యంత సంక్లిష్టంగా ఉంటే సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్ల చట్టాన్ని సవరిస్తామని ముందుకు సాగుతున్నది. కానీ పలు రకాల అభ్యంతరాలు, సమస్యల మధ్య రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభిస్తుండటం సందేహాల నీలి నీడలు కమ్ముకున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.

English summary
Telangana assembly speicial session for to be starts approved Telangana Reservation Bill. CM KCR planned gathered 'Sabbanda Varnas' with reservations for all sections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X