Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటు హక్కే పదునైన అస్త్రం.!18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్న సీఈసీ.!

హైదరాబాద్ : కొత్త ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. తొలిసారి ఓటు వేసి ప్రజా స్వామ్యంలో రాజ్యంలో ఓ వినూత్న అనుభవానికి శ్రీకారం చుట్టాలనుకున్న యువతకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. 18సంవత్సరాలు పూర్తి చేసుకున్న యవతీ యువకులకు ఓటు హక్కును పదునైన అస్త్రంగా మలుచుకుని రాజకీయాల్లో సమూల మార్పులకు నాంది పలికే అద్బుతమై అవకాశాన్ని యువతకు అందిస్తోంది ఎన్నికల సంఘం. అందుకు సంబందించిన వివరాలను ఒకాసారి చూద్దాం.

18సంవత్సరాలు నిండిన వాళ్లు ఓటరుగా నమోదు చేసుకోవాలి.. మార్గదర్శకాలు విడుదల

18సంవత్సరాలు నిండిన వాళ్లు ఓటరుగా నమోదు చేసుకోవాలి.. మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్ జిల్లా పరిధిలో జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ప్రజలను కోరారు. భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ 2022 విడుదల చేసిన నేపథ్యంలో ఓటరు జాబితా పై ఏమైన అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ నేపథ్యం లో బి.ఎల్.ఓ లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్ తో అందుబాటులో ఉంటారని ఓటరు జాబితాలో తప్పుగా ఉన్న పేరు, అడ్రస్ ఇతర ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.

విధివిధానాలపై చర్చ.. భాగస్వామ్యం కావాలన్న ఎన్నికల సంఘం

విధివిధానాలపై చర్చ.. భాగస్వామ్యం కావాలన్న ఎన్నికల సంఘం

బుధవారం కమిషనర్ స్వీప్ కమిటీ సభ్యులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పై వర్చువల్ మీటింగ్ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు పేర్లు, అడ్రస్ ఒక నియోజక వర్గం నుండి మరొక నియోజకవర్గానికి మార్పు కోసం సంబంధిత ఇ.అర్.ఓ లకు, గానీ www.nvsp.in, లేదా ఓటరు నమోదు యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నూతన ఓటరు నమోదుకు ఫారం-6, ఓటరు జాబితా నుండి పేరు తొలగింపు కోసం ఫారం-7, ఓటరు జాబితా లో తప్పుల సవరణకు ఫారం-8, అదే నియోజకవర్గంలో అడ్రస్ మార్పుకు ఫారం-8A వినియోగంచుకోవాలన్నారు.

ఓటరు నమోదు ప్రక్రియకు శ్రీకారం.. విధివిధానాలపై ఈసీ కసరత్తు..

ఓటరు నమోదు ప్రక్రియకు శ్రీకారం.. విధివిధానాలపై ఈసీ కసరత్తు..

సభ్యులు సూచించిన సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. నియోజక వర్గంలో ఓటురు నమోదు అభ్యంతరాలు సరిచేసుకొనేవిధంగా ఆడియో ద్వారా తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ భాషలో ప్రచారం చేస్తున్నట్లు మొబైల్ యస్.ఏం.యస్ ద్వారా, బస్ షెల్టర్ హోల్డింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు దేవాలయాల్లో, మసీద్, చర్చిలలో ప్రార్థన సమయంలో అనౌన్స్ చేయించడమే కాకుండా అవగాహన కోసం కరపత్రాల పంపిణీ, పోలీస్ పీస్ కమిటీ సభ్యుల కు, అపార్ట్ మెంట్, కాలనీ కమిటీలకు సభ్యులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.

Recommended Video

    MLC Elections : బిగ్ ఫైట్.. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికల కోలాహలం..! || Oneindia Telugu
    పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు.. యువత ముందుకు రావాలన్న ఈసీ

    పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు.. యువత ముందుకు రావాలన్న ఈసీ

    అదే విధంగా సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్స్ అప్ తో పాటుగా రేడియో, టి విల ద్వారా అంతేకాకుండా కాలేజ్, పాఠశాలల్లో కూడా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా కృషిచేస్తామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పంకజ, సి.పి.అర్.ఓ మహమ్మద్ ముర్తుజా, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కే.వెంకట రమణ, సీనియర్ జర్నలిస్ట్ బచ్చన్ సింగ్, మీడియా కమ్యూనికేషన్ పి.ఐ.బి డిప్యూటీ డైరెక్టర్ వి.గాయత్రి, హైదరాబాద్ నెహ్రూ యువకేంద్రం కో-ఆర్డనేటర్ కుమారి ఖుష్బూ గుప్త, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ కో-ఆర్డనేటర్ లక్ష్మి, బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యన్.యస్.యస్ కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+