వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా అయోమయం.!డబ్బు,పలుకుబడి ఉంటేనే చికిత్స.!నగరంలో కరోనా రోగుల పరిస్థితి వర్ణనాతీతం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మీరు అప్పటి వరకు బాగానే ఉండి అంతలోనే తుమ్ములు, దగ్గు బారిన పడుతున్నారా.? గొంతు కూడా నొప్పిగా ఉండి, తల భారంగా మారుతోందా..?ఐతే అవి కరోనా లక్షణాలే..! ఇక మీకు కష్టాలు మొదలైనట్టే..అంతే కాకుండా 65ఏళ్లు పైబడిన ఎవరైనా ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా.? అకస్మాత్తుగా ఆక్సీజన్ అవపరమా.? మీకు ఇబ్బందులు ఎదురైనట్టే.. పై సమస్యలతో ఎవరైనా ఆసుపత్రికి వెళ్దామనుకుంటే నరకాన్ని చూసే పరిస్థితులు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొన్నాయి. కరోనా లక్షణాలు సోకిన వారు ఆసుపత్రుల్లో చేరడానికి నగరంలో నరక యాతన అనుభవిస్తున్న సందర్బాలు చోటుచేసుకుంటున్నాయి.

 అంతా అగమ్యగోచరమే.. ఆసుపత్రుల్లో సౌకర్యాల పరిస్థితి అంతా గోప్యమే..

అంతా అగమ్యగోచరమే.. ఆసుపత్రుల్లో సౌకర్యాల పరిస్థితి అంతా గోప్యమే..

నగరంలో కరోనా రోగుల పరిస్థితి ఎంతో దయనీయంగా తయారయ్యింది. ఏ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు ఉన్నయో, ఆక్సీజన్ ఉందో లేదో సమాచారం ఇచ్చే వారు ఉండరు, ఐసియూ, వెంటిలేషన్ వంటి సౌకర్యాల గురించి చెప్పే నాథుడు ఉండడు. ఏ ఆసుపత్రికి ఫోన్ చేసినా ముందుగా వచ్చే జవాబు బెడ్లు లేవు.. ఆ తర్వాత బెడ్లు ఉంటే ఐసీయు సౌకర్యం లేదు.. ఐసీయూ సౌకర్యం ఉంటే ఆక్సీజన్ మాత్రం లేదు.. ప్రస్తుతం నగరంలోని ఓ మోస్తరు ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులు ఇవి. కరోనా గాని, ఇతర జ్వరంతో గానీ ఆసుపత్రుల్లో చేరదామంటే పడరాని కష్టాలు పడుతున్నారు సామాన్య మద్యతరగతి ప్రజలు.

 నానా అవస్థలు పడుతున్న సామాన్యుడు.. ఎవరూ తీర్చని కష్టాల్లో మద్యతరగతి ప్రజలు..

నానా అవస్థలు పడుతున్న సామాన్యుడు.. ఎవరూ తీర్చని కష్టాల్లో మద్యతరగతి ప్రజలు..

హైదరాబాద్ నగరంలో ఉన్న దాదాపు మూడు వందల స్పెషల్, మల్టీ స్పెషల్ తో కార్పోరేట్ ఆసుపత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి కాక ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం ఏ ఒక్క ఆసుపత్రికి ఫోన్ చేసి అడిగినా చేర్చుకోవడానికి సుముఖత చూపడం లేదు. ముందుగా వచ్చే సమాధానం బెడ్లు లేవని. మరి ప్రభుత్వం మాత్రం ఫలానా ఆసుత్రిలో ఇన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి, ఫలానా ఆసుపత్రిలో అన్ని బెడ్లు అందులో బాటులో ఉన్నాయని చెప్పుకొస్తోంది. కాని ప్రభుత్వం చెప్పేలెక్కలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన లేదనేది మాత్రం వందరు వంద శాతం వాస్తవం.

 అంతా పైసా, పరపతి మహిమ.. ఇన్ల్పూయెన్ప్ ఉంటేనే ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చేది..

అంతా పైసా, పరపతి మహిమ.. ఇన్ల్పూయెన్ప్ ఉంటేనే ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చేది..

ఇక ఎవరైనా పేషెంట్ ని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆంబులెన్స్ కి ఫోన్ చేస్తే అదో నరకం. ఆంబులెన్స్ కు కట్టే డబ్బులు కాకుండా అదనంగా ఎంతోకొంత చెల్లిస్తానంటేనే వస్తాం..లేకపోతే అసలు ఆంబులెన్స్ లు ఏవీ కూడా ఖాళీగా లేవు అనే సమాధానం వస్తుంది. ప్రస్తుతం నగరంలో ఆంబులెన్సుల పరిస్థితి ఇది. అంతా డబ్బు మయం లేదా పరిపతి. పోలీస్ ఉన్నతాదికారుల నుండి గాని, రాజకీయ నాయకుల నుండి గానీ ఫోన్ వెళ్లిందంటే ఆసుపత్రుల్లో బెడ్లు ఉంటాయి.. ఆక్సీజన్ వచ్చి చేరుతుంది.. ఐసీయూలు అందుబాటులోకి వస్తాయి. ఎంత ఎక్కువ డబ్బు, ఎంత పెద్ద రాజకీయ నాయకుడి పరపతి ఉపయోగిస్తే ప్రస్తుతం ఆసుపత్రుల్లో అంతటి నాణ్యమైన చికిత్స అందుతుంది.

 పాలకులు చెప్పుంది ఒకటి.. క్షేత్రస్తాయిలో నెలకొన్న పరిస్థితులు మరొకటి..

పాలకులు చెప్పుంది ఒకటి.. క్షేత్రస్తాయిలో నెలకొన్న పరిస్థితులు మరొకటి..

ఇలాంటి తరుణంలో సామాన్య మద్యతరగతి వారు ఆసుత్రుల్లో చికిత్స పొందాలంటే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. డబ్బు, పరిపతి లేని వారు వర్ణించలేని ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆక్సీజన్ తో పాటు రెమిడిసివిర్ ఇంజక్షన్ అవసరమున్న వాళ్లు మాత్రం రెండితల డబ్బులను వెచ్చించి బ్లాక్ లో కొనుక్కునే పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ పాలకులకు గానీ, అధికారులకు గానీ తెలియని పరిస్థితులా.? అందరికీ అన్నీ తెలుసు. కానీ మనకెందుకులే అనే నిర్లక్ష్యం. ఎందుకు జాగ్రత్తగా వ్యవహరించలేదు. అనుభవించండి అనే తత్వం. ప్రస్తుతం నగరంలో కరోనా పేషెంట్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. పాలకులు చెప్తున్న అంశాలకు, క్షేత్రస్ధాయిలో ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదనేది కూడా వందకు వెయ్యి శాతం వాస్తవం.

Recommended Video

CoWin, Aarogya Setu and Umang app will be open for vaccine registrations | Oneindia Telugu

English summary
The condition of corona patients in the city has become very miserable. There will be no one to give information on how many beds there are in any hospital and whether there is oxygen and there will be no one to tell about facilities like ICU and ventilation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X